Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 40:6 - పవిత్ర బైబిల్

6 పిమ్మట ఆ మనిషి తూర్పు ద్వారం వద్దకు వెళ్లాడు. అక్కడ దాని మెట్లెక్కి ద్వారపు గడప వెడల్పు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది. మరియొక గడప వెడల్పు కూడ పది అడుగుల ఆరంగుళాలే ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అతడు తూర్పు గుమ్మానికి వచ్చి దాని మెట్లెక్కి గుమ్మపు గడపను కొలిస్తే అది 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అప్పుడతడు తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్లి దాని మెట్లెక్కి దాని గుమ్మపు గడపను కొలిచినప్పుడు అది ఒక కొలిచే కర్ర పొడవు ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అప్పుడతడు తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్లి దాని మెట్లెక్కి దాని గుమ్మపు గడపను కొలిచినప్పుడు అది ఒక కొలిచే కర్ర పొడవు ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 40:6
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవాలయం పక్కగా కట్టిన కింది గదులకు ప్రవేశ మార్గం దక్షిణ భాగాన వున్నది. రెండవ అంతస్తుకు వెళ్లటానికి, అక్కడి నుండి మూడవ అంతస్తు గదులకు వెళ్లటానికి మెట్ల మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.


తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవాలయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి సంతతికి చెందిన ద్వారపాలకులు.


తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు పక్కలా ఉన్నాయి.


ఇమ్మేరు కొడుకైన సాదోకు తన ఇంటి ముందరి గోడ భాగాన్ని బాగు చేశాడు. షెకన్యా కొడుకైన షెమయా గోడలో అటు తర్వాత భాగాన్ని బాగుచేశాడు. షెమయా తూర్పు ద్వార రక్షకుడు.


దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు. దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.


యెరూషలేము నగర కుమ్మరి ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్‌హిన్నోము లోయలోనికి వెళ్లు. నీతో పాటు కొందరు నాయకులను, యాజకులను తీసికొని వెళ్లు. ఆ స్థలంలో నేను నీకు ఏమి చెపుతానో దానిని వారికి తెలియజేయుము.


తరువాత యోహోవా మహిమ ఆలయ గుమ్మం మీది నుండి పైకిలేచి, కెరూబుల మీదికి వచ్చి అగింది.


తరువాత ఆత్మ (గాలి) నన్ను యెహోవా ఆలయపు తూర్పుద్వారం వద్దకు తీసుకొని వెళ్లింది. సూర్యుడు ఉదయించే వైపుకు ఈ ద్వారం తిరిగి ఉంది. ఈ ద్వారం ముందు ఇరవైఐదు మంది మనుష్యులున్నట్లు నేను చూశాను. అజ్జూరు కుమారుడైన యజన్యా వారితోవున్నాడు. బెనాయా కుమారుడు పెలట్యా కూడా అక్కడ వున్నాడు. పెలట్యా ఆ ప్రజలకు నాయకుడుగా ఉండెను.


ఉత్తర దిశకు ఉన్న వెలుపలి ఆవరణ ద్వారం యొక్క పొడవు వెడల్పులను ఆ మనిషి కొలిచాడు.


దాని కిటికీలు, దాని మండపం, ఖర్జూరపు చెట్ల చెక్కడాలు, తూర్పు ద్వారపు కొలతల పనితనం వలెనే ఉన్నాయి. ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. ద్వార మండపం లోపలికి ఉంది.


పిమ్మట ఆ మనిషి నన్ను దక్షిణానికి తీసుకొని వెళ్లాడు. అక్కడ నేను దక్షిణ ద్వారం చూశాను. అతడు ద్వారపు కమ్మీలను, మండపాన్ని కొలిచాడు. ఈ కొలతలు ఇతర ద్వారాల కొలతల మాదిరిగానే ఉన్నాయి.


ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. దాని మండప ద్వారం లోపల చివర వరకూ ఉంది. ద్వారానికి అటూ ఇటూ ఖర్జూరపు చెట్ల చెక్కడపు పనితనం ఉంది.


ఆలయ ఆవరణ చుట్టూ నేనొక గోడ చూశాను. ఆ మనిషి చేతిలో కొలత బద్ద ఉంది. దాని పొడవు ఆరు మూరలు. ఆ మనిషి గోడ యొక్క మందాన్ని కొలిచాడు. దాని మందం పది అడుగుల ఆరంగుళాలు. తరువాత అతడు గోడ ఎత్తు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది.


అక్కడ ఒక గది ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి పది అడుగుల ఆరంగుళాలు. గదుల మధ్య ఖాళీస్థలం ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాలు ఉంది. లోపలి వైపుకు తిరిగి ఉన్న ముఖ మండపం దిశలో ఉన్న ద్వారం యొక్క గడప వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు.


ఆలయపు గుమ్మం వద్ద క్రింది నుండి కిటికీల వరకు చుట్టూ బల్ల కూర్పువేయబడింది.


ఆలయపు లోపలి భాగాన్ని ఆ మనిషి కొలవటం పూర్తి చేసిన పిమ్మట, తూర్పు ద్వారం గుండా అతడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. గుడి బయటి భాగాన్నంతా అతడు కొలిచాడు.


ఆ మనుష్యుడు నన్ను తూర్పు ద్వారం వద్దకు నడిపించాడు.


అంచు కూడ పొడవు వెడల్పులు పన్నెండు మూరలు చొప్పున చదరంగా ఉంది. దాని చుట్టూ వున్న అంచు అరమూర ఉంది. అడుగు దిమ్మ చుట్టూ నీరు పోయే మార్గపు వెడల్పు రెండు మూరలు ఉంది. బలిపీఠం మీదికి మెట్లు తూర్పు దిక్కున ఉన్నాయి.”


వారి గడప నా గడప ప్రక్కన; వారి ద్వారం నా ద్వారం ప్రక్కన నెలకొల్పి వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయరు. గతంలో కేవలం ఒక్క గోడ మాత్రమే నాకు, వారికి అడ్డంగా ఉండేది. అందుచే వారు పాపం చేసిన ప్రతిసారి, భయంకర కార్యాలు చేసినప్పుడల్లా వారు నా పేరును అవమానపర్చారు అందుచేత నాకు కోపం వచ్చి నేను వారిని నాశనం చేశాను.


పిమ్మట ఆ మనుష్యుడు నన్ను ఆలయానికి తూర్పున ఉన్న వెలుపలి ద్వారం వద్దకి తిరిగి తీసుకొని వచ్చాడు. వెలుపలి ద్వారం మూసి ఉంది.


“పాలకుడు తను స్వంతంగా దహనబలులు గాని, సమాధాన బలులుగాని తన ఇష్టపూర్వక అర్పణ (స్వేచ్చార్పణ) గాని యెహోవాకు ఇవ్వదలచినప్పుడు అతనికోసం తూర్పు ద్వారం తెరువబడుతుంది. అప్పుడు తను విశ్రాంతి రోజున అర్పించినట్లు తన దహనబలిని, సమాధానబలిని అర్పిస్తాడు. అతడు వెళ్లినాక తిరిగి ద్వారం మూయబడుతుంది.


ఆ మనుష్యుడు నన్ను మళ్లీ ఆలయ ద్వారంవద్దకు నడిపించాడు. ఆలయ తూర్పు గుమ్మం క్రిందనుంచి నీరు బయటకు రావటం చూశాను. (ఆలయ ముఖద్వారం తూర్పునకే ఉంది) బలిపీఠానికి దక్షిణంగా ఉన్న ఆలయ దక్షిణపు భాగం చివరి నుండి నీరు ప్రవహిస్తూ ఉంది.


ఆయన నన్ను యెహోవా ఆలయం లోపలి ఆవరణలోనికి తీసుకొని వెళ్లాడు. ఆక్కడ ఇరవైఐదు మంది క్రిందికి వంగి ఆరాధించటం చూశాను. వారు ముందు మండపానికి, బలి పీఠానికి మధ్యలో ఉన్నారు. కాని వారు తప్పు దిశకు తిరిగి కూర్చున్నారు! వారి వీపులు పవిత్ర స్థలానికి వెనుతిరిగి ఉన్నాయి. వారు సూర్యుణ్ణి ఆరాధించటానికి వంగు తున్నారు!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ