Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 40:1 - పవిత్ర బైబిల్

1 మేము బందీలుగా ఉన్న తరువాత ఇరవై ఐదవ సంవత్సరం ఆదిలో ఆ నెల (అక్టోబరు), పదవ రోజున యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. అంటే ఇది ఆ రోజుకు బబులోను (బాబిలోనియా) వారు యెరూషలేమును వశపర్చుకున్న తరువాత పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఒక దర్శనంలో యెహోవా నన్నక్కడికి తీసికొని వెళ్లాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 మనం బబులోను చెరలోకి వచ్చిన 25 వ సంవత్సరం మొదటి నెల పదో రోజున, అంటే పట్టణం ఆక్రమణకు గురైన 14 వ సంవత్సరం అదే రోజు యెహోవా హస్తం నా మీదకి వచ్చి నన్ను పట్టణానికి తోడుకు పోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అప్పటికి మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదవ సంవత్సరంలోని మొదటి నెల పదవ రోజున, అనగా పట్టణం నాశనమైన పద్నాలుగవ సంవత్సరంలో ఆ రోజునే యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఆయన నన్ను పట్టణానికి తీసుకెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 అప్పటికి మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదవ సంవత్సరంలోని మొదటి నెల పదవ రోజున, అనగా పట్టణం నాశనమైన పద్నాలుగవ సంవత్సరంలో ఆ రోజునే యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఆయన నన్ను పట్టణానికి తీసుకెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 40:1
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు సమాజం అంతటికీ చెందుతుంది. ఈ నెల పదో రోజున ఒక్కొక్కరు తన ఇంటివారి కోసం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి.


నాలుగువందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ ఈజిప్టు దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి.


“మొదటి నెల మొదటి రోజున పవిత్ర గుడారాన్ని నిలబెట్టు.


పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపి మళ్ళీ బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వచ్చాడు. ఆయన నన్ను ఇశ్రాయేలు నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల వద్దకు తీసుకొనివచ్చాడు. ఆ దర్శనంలోనే యెహోవా ఆత్మ గాలిలోకి లేచి, నన్ను వదిలి వెళ్లాడు. అవన్నీ నేను దర్శనంలో చూశాను.


దేశంనుండి వెళ్ల గొట్టబడిన ఇరవై ఏడవ సంవత్సరం, మొదటి నెల (ఏప్రిల్) మొదటి రోజున దేవుని వాక్కు నాకు వినబడింది. ఆయన ఇలా చెప్పాడు,


గాలి (ఆత్మ) నన్ను పైకెత్తి దూరంగా తీసుకొని వెళ్లింది. నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. నేను నా ఆత్మలో దుఃఖించి తల క్రిందులయ్యాను! యెహోవా ప్రభావం నాలో శక్తివంతంగా పనిచేస్తూ ఉంది!


పిమ్మట యెహోవా హస్తం ఆ స్థలంలో నా మీదికి వచ్చింది. “లెమ్ము; లోయలోకి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని దేవుడు నాకు చెప్పాడు.


చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల (మార్చి) మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:


దేశం నుండి వెళ్లగొట్టబడిన పన్నెండవ సంవత్సరంలో, అదే నెలలో పదిహేనవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:


అది చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరంలో పదవ నెల (జనవరి) ఐదవరోజు. ఆ రోజున ఒక వ్యక్తి యెరూషలేము నుండి నా వద్దకు వచ్చాడు. అతడక్కడ యుద్ధం నుండి తప్పించుకుని వచ్చాడు. అతడు, “ఆ నగరం (యెరూషలేము) వశపర్చుకోబడింది!” అని అన్నాడు.


యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరం నుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది.


ఒకరోజు నేను (యెహెజ్కేలు) నా ఇంటిలో కూర్చొని ఉన్నాను. యూదా పెద్దలు నా ముందు కూర్చున్నారు. ఇది చెరబట్టబడిన కాలంలో ఆరవ సంవత్సరం, ఆరవ నెల (సెప్టెంబరు) ఐదవ రోజున జరిగింది. నా ప్రభువైన యెహోవా శక్తి అకస్మాత్తుగా నామీదికి వచ్చింది.


ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ