Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 39:9 - పవిత్ర బైబిల్

9 “ఆ సమయంలో ఇశ్రాయేలు నగరాలలో నివసిస్తున్న ప్రజలు ఆ పొలాలలోకి వెళతారు. వారు శత్రువుల ఆయుధాలన్నీ ఏరి తగలబెడతారు. డాళ్లు, ధనుస్సులు, బాణాలు, దుడ్డు కర్రలు, ఈటెలు అన్నీ వారు తగులబెడతారు. ఆ ఆయుధాలన్నిటినీ వారు ఏడేండ్ల పాటు వంట చెరకుగా ఉపయోగిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “ ‘అప్పుడు ఇశ్రాయేలు పట్టణాల్లో నివసించేవారు బయటకు వెళ్లి, ఆ ఆయుధాలను చిన్న పెద్ద డాళ్లు, విల్లులు బాణాలు, యుద్ధ దండాలు ఈటెలను తీసుకుని పొయ్యిలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఏడేళ్లపాటు వాటిని ఇంధనంగా వినియోగించనున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “ ‘అప్పుడు ఇశ్రాయేలు పట్టణాల్లో నివసించేవారు బయటకు వెళ్లి, ఆ ఆయుధాలను చిన్న పెద్ద డాళ్లు, విల్లులు బాణాలు, యుద్ధ దండాలు ఈటెలను తీసుకుని పొయ్యిలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఏడేళ్లపాటు వాటిని ఇంధనంగా వినియోగించనున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 39:9
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు. సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.


“ఈ ప్రజలు నా పవిత్ర పట్టణంలో ఉంటారు. మరియు పట్టణం బయటకు వెళ్తే నాకు విరోధంగా పాపం చేసిన మనుష్యుల శవాలను వారు చూస్తారు. ఆ శవాలు పురుగులు పట్టి ఉంటాయి. ఆ పురుగులు ఎన్నటికి చావవు. అగ్ని జ్వాలలు ఆ శవాలను కాల్చివేస్తాయి మరియు ఆ జ్వాలలు ఎన్నటికీ ఆరిపోవు.”


ఈ ఆయుధాలనే వారు వంట చెరకుగా ఉపయోగించటంతో వారు పొలాల్లో పుల్లలు ఏరటం గాని, అడవిలో కట్టెలు కొట్టటం గాని చేయవలసిన అవసరం లేదు. వారిని దోచుకోవాలని వచ్చిన సైనికుల నుండి విలువైన వస్తువులను వారే తీసుకుంటారు. తమవద్ద విలువైన వస్తువులను దోచుకున్న సైనికుల నుండి వారే మంచి వస్తువులను తీసుకుంటారు.” ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.


ఆ సమయం ఆసన్నమవుతూ ఉంది! అది జరిగి తీరుతుంది!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “ఆ రోజును గురించే నేను మాట్లాడుతున్నాను.


రాజు చెపుతున్నాడు, “నేను ఎఫ్రాయిములో రథాలనూ, యెరూషలేములో గుర్రవు రౌతులను నాశనం చేశాను. యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేశాను.” శాంతిని గూర్చిన వార్తను అన్య దేశాలు విన్నాయి. ఆ రాజు సముద్రంనుండి సముద్రంవరకు పరిపాలిస్తాడు. ఆయన నదినుండి భూమిపై సుదూర ప్రాంతాలవరకు పాలిస్తాడు.


ప్రజలారా, మీరు ఈ సంగతులు చూశారు, మరియు “ఇశ్రాయేలుకు వెలుపల కూడ యెహోవా గొప్పవాడు” అని మీరు చెప్పారు.


అప్పుడు యెహోవా, “ఆ సైన్యాన్ని చూచి భయపడకు. రేపు ఈ వేళకు మీరు ఆ సైన్యాన్ని ఓడించేటట్టు నేను చేస్తాను. వాళ్లందరినీ మీరు చంపేస్తారు. మీరు వారి గుర్రాల కుడికాళ్ల నరాలను నరికివేసి, వారి రథాలను తగులబెట్టేస్తారు” అని యెహోషువతో చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ