Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 39:4 - పవిత్ర బైబిల్

4 ఇశ్రాయేలు పర్వతాల మీద నీవు చంపబడతావు. నీవు, నీ సైనిక దళాలు, నీతో ఉన్న అన్య దేశాల జనులు యుద్ధంలో చంపబడతారు. మాంసం తినే ప్రతి పక్షి, క్రూర మృగాలకి నిన్ను ఆహారంగా పడవేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతములమీద కూలుదురు, నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 నువ్వూ నీ సైన్యమూ నీతో ఉన్న ప్రజలంతా ఇశ్రాయేలు పర్వతాల మీద కూలిపోతారు. నువ్వు నానా విధాలైన పక్షులకు, క్రూర జంతువులకు ఆహారమవుతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నీవు నీ సైన్యం నీతో పాటు ఉన్న అనేక జనులు ఇశ్రాయేలు పర్వతాలమీద కూలిపోతారు. వేటాడే రకరకాల క్రూర పక్షులకు, అడవి మృగాలకు నిన్ను ఆహారంగా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నీవు నీ సైన్యం నీతో పాటు ఉన్న అనేక జనులు ఇశ్రాయేలు పర్వతాలమీద కూలిపోతారు. వేటాడే రకరకాల క్రూర పక్షులకు, అడవి మృగాలకు నిన్ను ఆహారంగా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 39:4
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక ప్రమాణం చేశాడు. యెహోవా చెప్పాడు, “సరిగ్గా నేను తలచినట్టే ఈ సంగతులు జరుగుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ విషయాలు సరిగ్గా నా పథకం ప్రకారమే జరుగుతాయి.


అష్షూరు రాజును నేను నా దేశంలో నాశనం చేస్తాను. నా కొండలపై నేను ఆ రాజు మీద నడుస్తాను. ఆ రాజు నా ప్రజలను తనకు బానిసలుగా చేశాడు. వారి మెడల మీద అతడు ఒక కాడిపెట్టాడు. యూదా మెడమీద నుండి ఆ కాడి తొలగించి వేయబడుతుంది. ఆ భారం తొలగించబడుతుంది.


నేను నాలుగు రకాల విధ్వంసకారులను వారిపైకి పంపుతాను.’ ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది ‘నేను ఖడ్గధారులైన శత్రువులను సంహారానికి పంపుతాను. చనిపోయినవారి శరీరాలను లాగివేయటానికి కుక్కలను పంపుతాను. వారి శవాలను తినివేయటానికి, నాశనం చేయటానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను.


ఆ ప్రజల శవాలు దేశం ఒక అంచు నుండి మరో అంచువరకు పడి ఉంటాయి. చనిపోయిన వారి కొరకు విలపించే వారొక్కరూ ఉండరు. ఆ శవాలను ఎవ్వరూ సేకరించి సమాధి చేయరు పశువుల పేడవలె అవి నేలపై పడి ఉంటాయి.


“‘ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తెలియజేయుము, “శిథిలమైన ఆ నగరాలలో నివసిస్తున్న ప్రజలు నా కత్తిచేత చనిపోతారని నా ప్రాణము మీద ప్రమాణం చేసి నేను చెపుతున్నాను. ఆ సమయంలో ఎవరైనా బయట పొలాలలోనికి వెళితే జంతువులు వారిని చంపి తినివేసేలా చేస్తాను. కోటలలోను, గుహలలోను ప్రజలు దాగివుంటే వారు రోగాలతో చనిపోతారు.


దాని పర్వతాలన్నిటినీ శవాలతో కప్పివేస్తాను. ఆ శవాలు నీ కొండలన్నిటి మీద, నీ లోయలు, కనుమలన్నిటిలోను పడివుంటాయి.


నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “అంతేగాదు. ఇశ్రాయేలు పర్వతాల మీద అన్ని రకాల భయోత్పాతాలను గోగు మీదికి రప్పిస్తాను. అతని సైనికులు తమ కంగారులో ఒకరిపై ఒకరు పడి, తమ కత్తులతో ఒకరి నొకరు పొడుచుకొని చంపుకుంటారు.


నీవు నగర ప్రవేశం చేయవు. నీవు ఆరు బయటనే పొలాల్లో చంపబడతావు. ఇది చెప్పినది నేనే!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.


అశ్వదళం వారు దాడి చేస్తున్నారు. వారి కత్తులు మెరుస్తున్నాయి. వారి ఈటెలు తళుక్కుమంటున్నాయి! అక్కడ ఎంతోమంది చనిపోయారు. శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. శవాలు లెక్కకు మించి వున్నాయి. శవాలకు అడ్డంపడి ప్రజలు తొట్రిల్లుతున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ