యెహెజ్కేలు 27:2 - పవిత్ర బైబిల్2 “నరపుత్రుడా, తూరును గురించి ఈ విషాద గీతం పాడుము. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –నరపుత్రుడా, తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నరపుత్రుడా, తూరు పట్టణం గురించి శోకగీతం మొదలు పెట్టి దానికిలా చెప్పు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు: အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు: အခန်းကိုကြည့်ပါ။ |
నిన్ను గురించి వారు ఈ విషాద గీతిక పాడుతారు: “‘ఒహో తూరూ, నీవొక ప్రసిద్ధ నగరానివి. నీలో నివసించాలని ప్రజలు సముద్రాలు దాటి వచ్చారు. నీవు చాలా ప్రఖ్యాతి చెందిన దానివి. కాని నీవు లేకుండా పోయావు! సముద్రంలో నీవు బలమైనదానవు. నీలాగే నీలో నివసించిన ప్రజలు కూడా బలిష్ఠులు. నీ ముఖ్య భూమిలో నివసించే ప్రజలు నీవంటే భయపడేలా చేశావు.
“నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి ఈ విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా చెప్పు: “‘దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమైన యువకిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు. కాని, నిజానికి నీవు సముద్రాల్లో తిరుగాడే మహాసర్పానివా. నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటున్నావు. నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తున్నావు. నీవు ఈజిప్టు నదులను కెలుకుతున్నావు.’”