Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 23:3 - పవిత్ర బైబిల్

3 చిన్న వయస్సులో ఉండగనే వారిద్దరూ ఈజిప్టులో వేశ్యలయ్యారు. ఈజిప్టులో వారు మగవాళ్లతో పడుకొన్నారు. మనుష్యులను వారు తమ చనుమొనలు నలిపి, తమ యౌవ్వనపు చన్నులను పట్టుకోనిచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 వీళ్ళు ఐగుప్తు దేశంలో వేశ్యల్లా ప్రవర్తించారు. యవ్వనంలోనే వాళ్ళు వేశ్యల్లా ప్రవర్తించారు. అక్కడ వాళ్ళ రొమ్ములు వత్తడం, వాళ్ళ లేత చనుమొనలు నలపడం జరిగాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 వారు తమ యవ్వనం నుండి వ్యభిచారం చేస్తూ ఈజిప్టులో వేశ్యలుగా మారారు. ఆ దేశంలో వారి రొమ్ములు పిండబడ్డాయి, వారి కన్య చనుమొనలు నలిపివేయబడ్డాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 వారు తమ యవ్వనం నుండి వ్యభిచారం చేస్తూ ఈజిప్టులో వేశ్యలుగా మారారు. ఆ దేశంలో వారి రొమ్ములు పిండబడ్డాయి, వారి కన్య చనుమొనలు నలిపివేయబడ్డాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 23:3
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

తానొక మరుగులేని వ్యభిచారిణిలా ప్రవర్తిస్తున్నాననే చింతన చేయలేదు. అలా ఆమె తన దేశాన్ని ‘మలిన’ (అపవిత్ర) పర్చింది. రాతితోను, చెక్కలతోను చేసిన విగ్రహాలను ఆరాధించి, వ్యభిచార పాపానికి ఒడిగట్టుకుంది.


దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “కానీ నీవు నీ అందాన్ని నమ్ముకోవటం ప్రారంభించావు. నీకున్న మంచి పేరును నీవు వినియోగించుకుంటూ, నీవు నా పట్ల విశ్వాస ఘాతకురాలుగా వున్నావు. నీ ప్రక్కగా వెళ్లే ప్రతివాని పట్ల నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీకై నీవు వారందరికీ సమర్పించుకున్నావు!


నీవు నన్ను వదిలి, ఈ భయంకరమైన పనులన్నిటికీ పాల్పడ్డావు. నీ చిన్నతనాన్ని నీవు ఒక్క సారి కూడా గుర్తుకు తెచ్చుకోలేదు. నేను నిన్ను కనుగొన్నప్పుడు నీవు దిసమొలతో వున్నట్లు, రక్తంలో కొట్టుకుంటున్నట్లు నీకు జ్ఞాపకం లేదు.


“‘రోత పుట్టించే విగ్రహాలన్నిటినీ పారవేయమని నేను ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాను. ఈజిప్టు నుండి తేబడిన హేయమైన విగ్రహాలతో వారు కూడ హేయమైనవారుగా తయారు కావద్దని నేను చెప్పియున్నాను. నేను మీ దేవుడనైన యెహోవాను


కాని వారు నాపై తిరుగుబాటు చేసి, నేను చెప్పేది వినలేదు. ఈజిప్టువారి అపవిత్రమైన విగ్రహాలను పారవేయలేదు. వారి అపవిత్ర విగ్రహాలను ఈజిప్టులో వదిలివేయలేదు. కావున నేను (దేవుడు) ఉగ్రమైన నా కోపాన్ని చూపించటానికి ఈజిప్టులోనే వారిని నాశనం చేయదల్చాను.


పదే పదే ఒహొలీబా నాపట్ల అవిశ్వాసంతో ప్రవర్తించింది. పిమ్మట ఈజిప్టు తను చిన్న పిల్లగా వుండి జరిపిన ప్రేమ కలాపాలు జ్ఞాపకం తెచ్చుకుంది.


“ఒహొలీబా, నీ ప్రేమికుడు నీ చనుమొనలు ముట్టి, నీ యౌవ్వనపు చన్నులను పట్టిన ఆ రోజులను గురించి నీవిప్పుడు కలలు కంటున్నావు.


ఆ పాత్రలోనే నీవు విషం తాగుతావు. దానిని నీవు పూర్తిగా తాగుతావు. పిమ్మట పాత్ర క్రిందకు విసిరివేసి ముక్కలు చేస్తావు. బాధతో నీ రొమ్ములు చీరుకుంటావు. నేను ప్రభువైన యెహోవాను గనుక ఇది సంభవిస్తుంది. ఈ విషయాలు నేనే చెప్పాను.


పెద్ద కుమార్తె పేరు ఒహొలా. ఆమె చెల్లిలి పేరు ఒహొలీబా. ఆ అక్కా చెల్లెళ్లిద్దరూ నాకు భార్యలయ్యారు. మాకు పిల్లలు కలిగారు. (నిజానికి ఒహొలా సమరయ. ఒహొలీబా యెరూషలేము.)


కామ క్రీడలతో నీరసించిపోయిన ఆ స్త్రీతో నేను మాట్లాడినాను. వారంతా ఆమెతోను, ఆమె వారితోను వ్యభిచార పాపం చేస్తారా? అని అన్నాను.


దానికి తోడు, ఈజిప్టుతో తన ప్రేమ కలాపాలు ఆపలేదు. ఆమె చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఈజిప్టు ఆమెతో సంగమించాడు. ఆమె యౌవ్వనపు చన్నులు పట్టుకున్న మొదటి ప్రేమికుడే ఈజిప్టు. ఈజిప్టు తన దొంగ ప్రేమనంతా ఆమెపై ఒలకబోశాడు.


ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం. “వెళ్లి, ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కను. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు-వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు.


అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు (శ్రమగల)లోయను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది.


వారు వారి ‘మేక పోతు విగ్రహాలకు’ ఇంక ఎలాంటి బలులూ అర్పించకూడదు. ఆ ఇతర దేవుళ్ళను వారు వెంబడిస్తూ వచ్చారు. అలా వారు వ్యభిచారిణుల్లా ప్రవర్తించారు. ఈ నియమాలు ఎప్పటికీ కొనసాగుతాయి.


మనం ఈజిప్టు దేశంలో ఎలా జీవించామో మీకు జ్ఞాపకమే. ఇక్కడికి వచ్చే మార్గంలో ఉన్న దేశాల్లోంచి మనం ఎలా ప్రయాణం చేసామో అదీ మీకు జ్ఞాపకమే.


అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు మీరు యెహోవా మాటలు విన్నారు. కనుక మీరు యెహోవాను గౌరవించి, నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజించిన అసత్య దేవుళ్లను పారవేయండి. అది ఎప్పుడో చాలకాలం క్రిందట నదికి అవతల, ఈజిప్టులో జరిగిన విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి.


వాళ్ళ మృతదేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉన్నాయి. ఈ మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ వాళ్ళ ప్రభువు సిలువకు వేయబడ్డాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ