అందువల్ల యెహోయాహాజు యెరూషలేములో పరిపాలించలేకపోయాడు. ఫరోనెకో 7,500 తులాల వెండిని, 75 పౌన్ల బంగారమును యూదా కట్టునట్లుగా చేశాడు. ఫరోనెకో యోషీయా కుమారుడైన ఎల్యాకీమును కొత్త రాజుగా చేశాడు. ఫరోనెకో ఎల్యాకీము పేరుని యెహోయాకీము అని మార్చాడు. మరియు ఫరోనెకో ఎల్యాకీము యెహోయాహాజుని ఈజిప్టుకు తీసుకుని పోయాడు. యెహోయాహాజు ఈజిప్టులో మరణించాడు.
“‘అది గర్జించటం ప్రజలు విన్నారు. తాము పన్నిన బోనులో దానిని పట్టుకున్నారు! దాని నోటికి గాలం తగిలించారు. వారా కొదమ సింహాన్ని ఈజిప్టుకు తీసుకొని వెళ్లారు.
యెరూషలేములోని ప్రవక్తలు కుట్రలు పన్నుతున్నారు. తను తినదల్చిన జంతువును పట్టుకున్నప్పుడు గర్జించు సింహంలా వారున్నారు. ఆ ప్రవక్తలు ఎన్నో జీవితాలను నాశనం చేశారు. వారెన్నో విలువైన వస్తువులను తీసుకున్నారు. యెరూషలేములో ఎందరో స్త్రీలు విధవలు కావటానికి వారు కారకులయ్యారు.
“నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి ఈ విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా చెప్పు: “‘దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమైన యువకిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు. కాని, నిజానికి నీవు సముద్రాల్లో తిరుగాడే మహాసర్పానివా. నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటున్నావు. నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తున్నావు. నీవు ఈజిప్టు నదులను కెలుకుతున్నావు.’”