8 సారవంతమైన భూమిలో నాటబడింది ద్రాక్షామొక్క. మంచి నీటివనరు వున్నచోట నాట బడింది. దాని కొమ్మలు బాగా పెరిగి, కాపు కాయవలసి ఉంది. అది ఎంతో మేలురకం ద్రాక్షాలత అయివుండేది.’”
8-9 కావున నీవీలాగు ప్రకటింపుము –ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా? అది యెండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు, దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు.
మరో పెద్ద రెక్కల గ్రద్ద ద్రాక్షా మొక్కను చూసింది. ఆ గ్రద్దకు చాలా ఈకలు ఉన్నాయి. ఈ క్రొత్త గ్రద్ద తనను సంరక్షించాలని ఆ ద్రాక్షాలత కోరింది. అందువల్ల తన వేళ్లు గ్రద్ద వైపు పెరిగేలా చేసింది ఆ మొక్క. దాని కొమ్మలు ఆ గ్రద్ద వైపుకే విస్తరించాయి. అది నాటబడిన పొలాన్ని అధిగమించింది. దాని కొమ్మలు ప్రాకాయి. తనకు నీళ్లు పోయమని ద్రాక్షాచెట్టు క్రొత్త గ్రద్దను కోరింది.
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “మరి ఆ మొక్క విజయం సాధిస్తుందని మీరనుకుంటున్నారా? లేదు! ఆ క్రొత్త గ్రద్ద మొక్కను భూమినుండి పెరికివేస్తుంది. మొక్క వేళ్లను గ్రద్ద నరికివేస్తుంది. వున్న కాయలన్నీ అదే తినేస్తుంది. క్రొత్త ఆకులన్నీ ఎండి రాలిపోతాయి. మొక్క చాలా బలహీనమవుతుంది. మొక్కను వేళ్లతో లాగివేయటానికి అది గట్టి ఆయుధాలు పట్టటం గాని, బలమైన సైన్య సహాయాన్ని గాని తీసుకోదు.
మంచి నీటివనరు చెట్టును బాగా పెరిగేలా చేసింది. లోతైన నది అది ఎత్తుగా పెరగటానికి దోహదమిచ్చింది. చెట్టు నాటబడిన ప్రాంతంలో నదులు ప్రవహించాయి. దాని కాలువలే అక్కడి పొలాల్లో ఉన్న చెట్లకు నీటిని అందజేశాయి