Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 17:6 - పవిత్ర బైబిల్

6 ఆ విత్తనం మొలకెత్తి ద్రాక్షా చెట్టయ్యింది. అది మంచి ద్రాక్షాలత. ఆ మొక్క ఎత్తుగా లేదు. అయినా అది ఎక్కువ విస్తీర్ణంలో పాకింది. అది కొమ్మలు తొడిగింది. చిన్న కొమ్మలు చాలా పొడుగ్గా పెరిగాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను; దాని కొమ్మలు ఆ పక్షిరాజువైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను; ఆలాగున ఆ ద్రాక్షచెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలువేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అది మొలకలు వేసింది. పైకి పెరగకుండా భూమిపై ఎత్తు పెరగకుండానే విశాలమైన కొమ్మలతో నేలపై వ్యాపించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు ఆ డేగ వరకూ వ్యాపించాయి. దాని వేళ్ళు డేగ కింద వైపుకు వ్యాపించాయి. ఆ విధంగా ఆ ద్రాక్ష చెట్టు అనేక శాఖలతో వర్ధిల్లి కొత్తగా రెమ్మలు వేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అది చిగురు వేసి పైకి పెరగకుండ నేలమీద విస్తరించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు గ్రద్ద వరకు వెళ్లాయి, కాని దాని వేర్లు గ్రద్ద క్రింద ఉన్నాయి. అలా అది ద్రాక్షవల్లిలా మారి అనేక కొమ్మలతో రెమ్మలు వేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అది చిగురు వేసి పైకి పెరగకుండ నేలమీద విస్తరించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు గ్రద్ద వరకు వెళ్లాయి, కాని దాని వేర్లు గ్రద్ద క్రింద ఉన్నాయి. అలా అది ద్రాక్షవల్లిలా మారి అనేక కొమ్మలతో రెమ్మలు వేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 17:6
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

వసంత ఋతువులో యెహోయాకీనును పట్టి తెమ్మని రాజైన నెబకద్నెజరు తన మనుష్యులను పంపాడు. వారు యెహోయాకీనును, యెహోవా ఆలయం నుండి కొన్ని ధనరాసులను బబులోనుకు తెచ్చారు. యూదా, యెరూషలేములకు నూతన రాజుగా సిద్కియాను నెబకద్నెజరు నియమించాడు. సిద్కియా అనువాడు యెహోయాకీనుకు బంధువు.


గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు. ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు. ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు. నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.


అందమైన ఒక వేసవి రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని ఎండాకాలపు కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త ద్రాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. శత్రువు ద్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు.


దానితో యూదా ఒక బలహీన రాజ్యంగా మారిపోయింది. అందువల్ల అది రాజైన నెబుకద్నెజరును ఎదిరించలేక పోయింది. యూదా యొక్క నూతన రాజుతో చేసుకొన్న ఒడంబడికను ఆచరించేలా నెబుకద్నెజరు ప్రజలపై ఒత్తిడి తెచ్చాడు.


కనాను నుండి పిదప కొన్ని విత్తనాల (ప్రజల)ను ఆ గ్రద్ద తీసుకుంది. సారవంతమైన భూమిలో వాటిని నాటింది. అది వాటిని మంచి నదీతీరాన నాటింది.


మరో పెద్ద రెక్కల గ్రద్ద ద్రాక్షా మొక్కను చూసింది. ఆ గ్రద్దకు చాలా ఈకలు ఉన్నాయి. ఈ క్రొత్త గ్రద్ద తనను సంరక్షించాలని ఆ ద్రాక్షాలత కోరింది. అందువల్ల తన వేళ్లు గ్రద్ద వైపు పెరిగేలా చేసింది ఆ మొక్క. దాని కొమ్మలు ఆ గ్రద్ద వైపుకే విస్తరించాయి. అది నాటబడిన పొలాన్ని అధిగమించింది. దాని కొమ్మలు ప్రాకాయి. తనకు నీళ్లు పోయమని ద్రాక్షాచెట్టు క్రొత్త గ్రద్దను కోరింది.


“‘మీ తల్లి నీటి ప్రక్క నాటిన ద్రాక్షాలతలాంటిది. దానికి నీరు పుష్కలంగా ఉంది. అది చాలా ఫలభరితమైన దళమైన ద్రాక్షా తీగలతో పెరిగింది.


అది పాముఖ్యం లేని రాజ్యంగా తయారవుతుంది. అది మరెన్నడూ సాటి రాజ్యాల కంటె మిన్నగా పెరగజాలదు. అది ఇతర రాజ్యాల మీద ఆధిపత్యం చేయలేనంత చిన్నగా దానిని నేను తగ్గించి వేస్తాను.


గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ