యెహెజ్కేలు 14:9 - పవిత్ర బైబిల్9 ఏ ప్రవక్తయేగాని మూర్ఖంగా తన స్వంత సమాధానమిస్తే, అతడెంత మూర్ఖుడో నేనతనికి నిరూపిస్తాను! అతనికి వ్యతిరేకంగా నా శక్తిని వినియోగిస్తాను. అతనని నాశనం చేసి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల నుండి అతనిని తొలగిస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మరియు ప్రవక్త యొకడు మోసపోయి ఒకమాట చెప్పినయెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలోనుండి వానిని నిర్మూలముచేసెదను အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఒకవేళ ఎవరన్నా ఒక ప్రవక్త మోసపోయి ఒక సందేశం పలికితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి విరోధంగా నా చెయ్యి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలు నుండి అతణ్ణి నాశనం చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “ ‘ఎవరైనా ప్రవక్త మోసపోయి ఏదైన ప్రవచనం చెబితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి వ్యతిరేకంగా నా చేయి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలులో నుండి అతన్ని నాశనం చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “ ‘ఎవరైనా ప్రవక్త మోసపోయి ఏదైన ప్రవచనం చెబితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి వ్యతిరేకంగా నా చేయి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలులో నుండి అతన్ని నాశనం చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |
కనుక వారి స్వంత రహస్యాలనే నేను ఉపయోగించాలని నేను నిర్ణయించుకొన్నాను. అంటే, దేనికైతే వారు ఎక్కువగా భయపడతారో వాటినే ప్రయోగించి వారిని శిక్షించాలని నా ఉద్దేశం. నేను ఆ ప్రజలను పిలిచాను కాని వారు వినిపించుకోలేదు. నేను వారితో మాట్లాడాను కానీ వారు నా మాట వినలేదు కనుక నేనుకూడా వారికి అదే విధంగా చేస్తాను. నేను కీడు అని చెప్పిన వాటినే ఆ ప్రజలు చేశారు. నాకు ఇష్టంలేని వాటినే వారు జరిగించేందుకు ఎంచుకొన్నారు.”
మనుష్యులు అంతా చెడ్డవాళ్లే. అందుచేత యువకుల విషయం యెహోవాకు సంతోషం లేదు. వారి విధవలకు, అనాధలకు యెహోవా దయ చూపించడు. ఎందుకంటే, ప్రజలంతా చెడ్డవాళ్లే గనుక. దేవునికి విరోధమైన వాటిని మనుష్యులు చేస్తారు. మనుష్యులు అబద్ధాలు చెబుతారు. అందుచేత దేవుడు మనుష్యులమీద కోపంగానే ఉంటాడు. దేవుడు మనుష్యుల్ని శిక్షిస్తూనే ఉంటాడు.
“ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో. శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు నీవు ప్రతిఫలం చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు. మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చెపుతున్నాడు.