Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 1:10 - పవిత్ర బైబిల్

10 ప్రతి జంతువుకు నాలుగు ముఖాలున్నాయి. ప్రతి ఒక్కటి ముందువైపు మనుష్య ముఖం కలిగిఉంది. కుడివైపు సింహపు ముఖం ఉంది. ఎడమ ప్రక్క ఎద్దు ముఖం ఉంది. వెనుకవైపు గ్రద్ద ముఖం ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 వాటి ముఖాలు ఎదుట నుంచి చూస్తే మనిషి ముఖాల్లా ఉన్నాయి. కుడివైపు నుండి చూస్తే సింహం ముఖంలా ఎడమవైపు నుండి చూస్తే ఎద్దు ముఖంలా ఉన్నాయి. ఇంకా ఈ నాలుగు జీవులకీ డేగ లాంటి ముఖాలు ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 ఆ నాలుగింటికి మానవ ముఖంలాంటి ముఖాలు ఉన్నాయి, కుడి వైపున సింహపు ముఖం, ఎడమవైపున ఎద్దు ముఖం ఉన్నాయి. ప్రతి దానికి గ్రద్ద ముఖం ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 ఆ నాలుగింటికి మానవ ముఖంలాంటి ముఖాలు ఉన్నాయి, కుడి వైపున సింహపు ముఖం, ఎడమవైపున ఎద్దు ముఖం ఉన్నాయి. ప్రతి దానికి గ్రద్ద ముఖం ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 1:10
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

గాదీయులలో కొంతమంది ఎడారి ప్రాంతంలో కోటలో దాగివున్న దావీదును కలిశారు. వారు బాగా యుద్ధ శిక్షణ పొందిన సైనికులు. వారు డాలు పట్టి ఈటెను ఉపయోగించటంలో ఆరితేరినవారు. వారు సింహం లాంటి ముఖాలతో భయంకరంగా వుంటారు. వారు కొండల్లో జింకల్లా పరుగెత్తగలరు.


యోబూ, పక్షిరాజు ఎగరాలని, పర్వతాల్లో ఎత్తుగా దాని గూడు కట్టుకోవాలని నీవు దానికి ఆజ్ఞాపించావా?


పని చేయటానికి ఎద్దులు లేకపోతే గాదెలో ధాన్య ముండదు ఒక గొప్ప పంట పండించటానికి మనుష్యులు ఎద్దు బలాన్ని ఉపయోగించవచ్చు.


కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు తీస్తూ ఉంటారు. వారు అలసి పోకుండా నడుస్తారు.


“ప్రజలారా, మీరు పాపం చేశారు. ఈ సంగతులను గూర్చి మీరు మరల ఆలోచన చేయాలి. ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని బలవంతంగా ఉండండి.


కాని ప్రతీ జంతువుకు నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి.


ప్రతి కెరూబుకూ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబు ముఖం. రెండవ ముఖం మనుష్య ముఖం. మూడవది సింహపు ముఖం. నాల్గవది గద్దముఖం. ఈ కెరూబు దూతలు నేను కెబారు కాలువ వద్ద దర్శనంలో చూచిన జీవులే. పిమ్మట కెరూబు గాలిలోకి పైకి లేచారు.


ఒకటి మానవ ముఖం ఆకారంలో ఉండి ఒక ప్రక్క నున్న ఖర్జూరపు చెట్టు వైపు చూస్తూ ఉంటుంది. రెండవది సింహపు ముఖం. అది రెండవ ప్రక్కనున్న ఖర్జూరపు చెట్టును చూస్తూ ఉంటుంది. అవి ఆలయం మీద అన్ని చోట్లా చెక్కబడ్డాయి.


“మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి గ్రద్ద రెక్కలున్నాయి. ఆ మృగాన్ని గమనిస్తూండగా దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి పైకి లేచి, మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది.


“పవిత్ర గుడారానికి దక్షిణాన రూబేను డేరా ధ్వజం ఉంటుంది. ఒక్కో వంశం దాని ధ్వజం దగ్గర నివాసం చేస్తారు. షెదేయూరు కుమారుడు ఏలీసూరు రూబేను వారికి నాయకుడు.


“ఎఫ్రాయిము వారి గుడారపు ధ్వజం పడమటి దిక్కున ఉంటుంది. ఎఫ్రాయిము విభాగములు అక్కడ నివసిస్తాయి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము ప్రజలకు నాయకుడు.


“దాను వారి గుడారపు ధ్వజం ఉత్తర దిశన ఉంటుంది. దాను కుటుంబ విభాగాలు అక్కడ నివసిస్తాయి. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను వారికి నాయకుడు.


“యూదా డేరా పతాకం తూర్పుపక్క అంటే సూర్యోదయ దిశన ఉంటుంది. యూదా ప్రజలకు అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను నాయకుడు.


నేను చెప్పేదేమిటంటే అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు.


సోదరులారా! చిన్నపిల్లలవలె ఆలోచించకండి. చెడు విషయంలో చిన్నపిల్లల్లా ఉండండి. కాని ఆలోచించేటప్పుడు పెద్దవాళ్ళలా ఆలోచించండి.


“దూరంనుండి మీ మీదికి ఒక రాజ్యాన్ని యెహోవా తీసుకొని వస్తాడు. ఈ రాజ్యం భూమి అవతలి పక్కనుండి వస్తుంది. ఈ రాజ్య భాష మీకు అర్థం కాదు. ఆకాశంనుండి పక్షిరాజు వచ్చినట్టు ఈ రాజ్యం వేగంగా మీ మీదికి వస్తుంది.


మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి.


అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!” అని అన్నాడు.


ఏడవ రోజున సూర్యుడు అస్తమించేలోగా ఫిలిష్తీయుల మనుష్యులకు సమాధానం లభించింది. వారు సమ్సోను వద్దకు వచ్చి, ఇలా అన్నారు: “తేనె కంటె మధురమైనదేది? సింహంకంటె బలంకలది ఏది?” తర్వాత సమ్సోను వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు కనుక నా ఆవుతోనే దున్నక పోతే మీరు నా విప్పుడుకథను పరిష్కరించి ఉండలేరు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ