నిర్గమ 22:30 - పవిత్ర బైబిల్30 అలాగే నీ ఆవుల్లో, గొర్రెల్లో, మొదట పుట్టిన వాటిని నాకు ఇవ్వు. అవి ఏడు రోజులు వాటి తల్లితో ఉండవచ్చు. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱెలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లియొద్ద ఉండవలెను. ఎనిమిదవదినమున దానిని నాకియ్యవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అదే విధంగా నీ ఎద్దులు, గొర్రెలు అర్పించాలి. మీరు ప్రతిష్ఠించినవి మొదటి ఏడు రోజులు తమ తల్లి దగ్గర ఉన్న తరువాత ఎనిమిదవ రోజు నాకు ప్రతిష్ఠించాలి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 మీ పశువులు గొర్రెల విషయంలో కూడా అలాగే చేయాలి. వాటిని తల్లి దగ్గర ఏడు రోజుల వరకు ఉంచాలి. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 మీ పశువులు గొర్రెల విషయంలో కూడా అలాగే చేయాలి. వాటిని తల్లి దగ్గర ఏడు రోజుల వరకు ఉంచాలి. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, “అయ్యో, నా ప్రభువైన యెహోవా, నేనెన్నడూ అపరిశుద్ధ ఆహారాన్ని తినలేదు. వ్యాధిచే చచ్చిన జంతు మాంసంగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా చిన్ననాటి నుండి ఈ నాటి వరకు నేను ఎన్నడూ అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంసమేదీ నానోట బడలేదు.”
“దానంతట అదే చచ్చిన ఏ జంతువునూ తినవద్దు. చచ్చిన జంతువును మీ ఊళ్లో ఉన్న విదేశీయునికి మీరు ఇవ్వవచ్చు, అతడు దాన్ని తినవచ్చు. లేక చచ్చిన జంతువును విదేశీయునికి మీరు అమ్మవచ్చు. కానీ మీ మట్టుకు మీరు చచ్చిన జంతువును తినకూడదు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు చెందిన వారు గనుక. మీరు ఆయనకు ప్రత్యేక ప్రజలు. “గొర్రెపిల్లను దాని తల్లి పాలతో వండవద్దు.