నిర్గమ 20:2 - పవిత్ర బైబిల్2 “నేను మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశం నుండి నేనే మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి) အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. အခန်းကိုကြည့်ပါ။ |
ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధంగా పాపం చేశారు కనుక, ఈ విషయాలు జరిగాయి. ఆ యెహోవాయే ఈజిప్టు నుండి ఇశ్రాయేలు వారిని బయటకు తీసుకువచ్చాడు. మరియు ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి యెహోవాయే రక్షించాడు. కాని ఇశ్రాయేలు వారు ఇతర దేవుళ్లను పూజించసాగారు. ఈజిప్టు రాజైన ఫరో అధికారం నుండి యెహోవా వారిని సంరక్షించాడు.
ఆహాజు పాపం చేయటంతో అతని దేవుడైన యెహోవా అతనిని అరాము (సిరియా) రాజు చేతిలో ఓడిపోయేలా చేశాడు. అరాము రాజు, అతని సైన్యం ఆహాజును ఓడించి, అనేకమంది యూదా వారిని బందీలుగా పట్టుకున్నారు. అరాము రాజు ఆ బందీలను దమస్కు (డెమాస్కస్) నగరానికి పట్టుకుపోయాడు. ఇశ్రాయేలు రాజైన పెకహు కూడా ఆహాజును ఓడించేలా యెహోవా చేశాడు. పెకహు తండ్రి పేరు రెమల్యా. పెకహు అతని సైన్యం కలిసి ఒక్కరోజులో యూదాకు చెందిన ఒక లక్షా ఇరవై వేలమంది ధైర్యంగల సైనికులను చంపివేశారు. వారి పూర్వీకులు విధేయులైవున్న వారి దేవుడైన యెహోవాకు వారు అవిధేయులైనందువల్ల పెకహు యూదా ప్రజలను ఓడించ గలిగాడు.
“మీరెందుకు ఇలా చేస్తున్నారని భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. ‘దీనంతటికీ భావం ఏమిటి?’ అని వారు అంటారు. దానికి మీరు యిలా జవాబిస్తారు. ‘ఈజిప్టు నుండి మనల్ని రక్షించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడు. అక్కడ మనం బానిసలంగా ఉంటిమి. అయితే యెహోవా మనల్ని అక్కడ నుండి బయటకు నడిపించి ఇక్కడకు తీసుకొచ్చాడు.
‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మాకు ఎడారులలో మార్గదర్శి అయిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ, ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు. ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు. కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’ మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”
యెహోవాదూత గిల్గాలు పట్టణం నుండి బోకీము పట్టణానికి వెళ్లాడు. యెహోవా నుండి వచ్చిన ఒక సందేశాన్ని ఆ దూత ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఇదే ఆ సందేశం: “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చాను. నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి నేను మిమ్మల్ని నడిపించాను. మీతో నేను చేసిన నా ఒడంబడికను నేను ఎన్నడూ ఉల్లంఘించను.