Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రసంగి 7:4 - పవిత్ర బైబిల్

4 అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే ఆలోచిస్తాడు, కాని, వివేకి మృత్యువు గురించి ఆలోచిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 జ్ఞానులు తమ దృష్టిని దుఃఖంలో ఉన్నవారి ఇంటి మీద ఉంచుతారు. అయితే మూర్ఖుల ఆలోచనలన్నీ విందులు చేసుకొనే వారి ఇళ్ళపై ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 జ్ఞానుల హృదయం దుఃఖపడే వారి గృహంలో ఉంటుంది కాని బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంట్లో ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 జ్ఞానుల హృదయం దుఃఖపడే వారి గృహంలో ఉంటుంది కాని బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంట్లో ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రసంగి 7:4
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్షాలోము తన సేవకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “అమ్నోనును ఒక కంట కనిపెట్టి వుండండి. వాడు బాగా తాగిన పిమ్మట ‘అమ్నోనును చంపండి’ అంటాను. ఆ సమయంలో వానిని చంపండి! భయపడకండి నేను మీకు అజ్ఞ ఇస్తున్నాను! నిబ్బరంగా, ధైర్యంగా వుండండి” అని అబ్షాలోము సేవకులతో అన్నాడు.


మధ్యాహ్నమయ్యింది. రాజైన బెన్హదదు, అతనికి తోడుగా ఉన్న మొప్పైరెండు మంది పాలకులు వారి గుడారాలలో బాగా మద్యపానం చేసి మైకంలో వున్నారు. ఈ సమయంలో రాజైన అహాబు దండయాత్ర మొదలయ్యింది.


నాలో నేను, “నేను సరదాగా గడపాలి. నేను నా శాయశక్తులా సమస్త సుఖాలూ అనుభవించాలి” అనుకున్నాను. కాని, అది కూడా నిష్ప్రయోజనమైన పనే అని గ్రహించాను.


నవ్వుకంటె దుఃఖం మరింత మేలు, ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్తమైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది.


మూర్ఖుడి పొగడ్త పొందడం కంటె, వివేకిచే విమర్శింప బడటం మేలు.


నేను దిగులుగా ఉన్నాను, భయంతో వణకిపోతున్నాను. సంతోషకరమైన నా సాయంపూట, భయం పుట్టే రాత్రిగా తయారయింది.


ఆ ప్రజలు కొదమ సింహాలలా ప్రవర్తిస్తున్నారు. వారికి నేనొక విందు. ఇస్తాను. వారు బాగా మద్యం సేవించేలా చేస్తాను. వారు నవ్వుతూ విలాసంగా కాలక్షేపం చేస్తారు. తరువాత వారు శాశ్వతంగా నిద్రపోతారు. వారిక మేల్కొనరు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


బబులోను యొక్క ముఖ్యమైన అధిపతులను, జ్ఞానులను మత్తిల్లజేస్తాను. దాని పాలకులను, అధికారులను, సైనికులను కూడ మత్తిల్లజేస్తాను. దానితో వారు శాశ్వతంగా నిద్రిస్తారు. వారు ఎప్పిటికీ మేల్కొనరు.” ఈ విషయాలు రాజు చెప్పియున్నాడు. ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.


ఆ రాత్రే బబులోను రాజైన బెల్షస్సరు హతుడయ్యాడు.


మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు. ద్రాక్షామద్యపు వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు. కనుక దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు కలుపుతారు.


చిక్కుపడిన ముండ్లపొదలా నీ శత్రువు నాశనం చేయబడతాడు. ఎండిన కలుపు మొక్కల్లా వారు వేగంగా కాలిపోతారు.


అబీగయీలు తిరిగి వచ్చేసరికి నాబాలు ఇంటి వద్దనే ఉన్నాడు. నాబాలు ఒక రాజులా తింటూ ఉన్నాడు. బాగా తాగి, ఉల్లాసంగా ఉన్నాడు. అందుచేత అబీగయీలు మరుసటి రోజు ఉదయం వరకు నాబాలుతో ఏమీ చెప్పలేదు.


ఈజిప్టువాడు దావీదును అమాలేకీయుల దగ్గరకు నడిపించాడు. ఆ సమయంలో వారు తాగుతూ, తింటూ నేలమీద ఇక్కడా అక్కడా పండుకొనివున్నారు. ఫిలిష్తీయుల దేశం నుండి, యూదా దేశం నుండి వారు కొల్లగొట్టిన అస్తిపాస్తులను చూసు కుంటూ సంబరం జరుపుకుంటున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ