ప్రసంగి 12:5 - పవిత్ర బైబిల్5 ఎత్తయిన ప్రదేశాలంటే నీకు భయం వేస్తుంది. నీ దోవలో ఏ చిన్న వస్తువు ఉన్నా, దానిమీద కాలువేస్తే ఎక్కడ బోల్తాపడిపోతానో అని నీకు బెదురు కలుగుతుంది. నీ జుట్టు నెరిసి, బాదం చెట్టు పూతలా కనిపిస్తుంది. నీవు కాళ్లీడ్చుకుంటూ మిడతలా నడుస్తావు. నీవు నీ కోరికను కోల్పోతావు (జీవించటానికి). అప్పుడిక నీవు నీ శాశ్వత నివాసానికి (సమాధిలోకి) పోతావు. (నీ శవాన్ని సమాధికి మోసుకెళ్తూ) విలాపకులు వీధుల్లో గుమిగూడి శోకనాలు పెడతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, సహజమైన కోరికలు అంతరిస్తాయి. అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మనుష్యులు ఎత్తైన స్థలాలకు వీధుల్లో అపాయాలకు భయపడతారు; బాదం చెట్టు పూలు పూస్తుంది మిడత తనను తాను ఈడ్చుకు వెళ్తున్నప్పుడు ఇక కోరికలు రేపబడవు. మనుష్యులు శాశ్వత నివాసం చేరుకుంటారు వారి కోసం ఏడ్చేవారు వీధుల్లో తిరుగుతారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మనుష్యులు ఎత్తైన స్థలాలకు వీధుల్లో అపాయాలకు భయపడతారు; బాదం చెట్టు పూలు పూస్తుంది మిడత తనను తాను ఈడ్చుకు వెళ్తున్నప్పుడు ఇక కోరికలు రేపబడవు. మనుష్యులు శాశ్వత నివాసం చేరుకుంటారు వారి కోసం ఏడ్చేవారు వీధుల్లో తిరుగుతారు. အခန်းကိုကြည့်ပါ။ |