ద్వితీ 6:2 - పవిత్ర బైబిల్2 మీరూ, మీ సంతతివారు బ్రతికినంత కాలం మీ దేవుడైన యెహోవాను గౌరవించాలి. నేను మీకు యిచ్చే ఆయన నియమాలు, ఆజ్ఞలు అన్నింటికీ మీరు విధేయులు కావాలి. మీరు ఇలా చేస్తే, ఆ కొత్త దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతుకుతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్ట డలు విధులు ఇవే. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మీరు, మీ పిల్లలు, వారి పిల్లలు జీవితకాలమంతా మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఇచ్చే ఆయన శాసనాలు, ఆజ్ఞలు పాటించడం ద్వారా మీరు దీర్ఘాయువును అనుభవిస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మీరు, మీ పిల్లలు, వారి పిల్లలు జీవితకాలమంతా మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఇచ్చే ఆయన శాసనాలు, ఆజ్ఞలు పాటించడం ద్వారా మీరు దీర్ఘాయువును అనుభవిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |
సరే, ఈ గ్రంథంలోని విషయాలన్నీ చదివి మనం నేర్చుకోవలసింది ఏమిటి? మనిషి చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పనేమిటంటే, దేవుని పట్ల భయ భక్తులు కలిగివుండటం, దేవుని ఆజ్ఞలు పాటించడం. ఎందుకంటే, మనుష్యులు చేసే పనులన్నీ గుప్త కార్యాలతో బాటు దేవునికి తెలుసు. ఆయనకి మనుష్యుల మంచి పనులను గురించీ చెడ్డ పనులను గురించీ సర్వం తెలుసు. మనుష్యుల పనులేవీ దేవుని విచారణకు రాకుండా పోవు.
“ఈ వేళ మీరు కోరుకొనేందుకు రెండు విషయాలు మీకు యిస్తున్నాను. మీరు కోరుకొనే దానికి సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగుతున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు లేదా మరణం కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదం తెచ్చిపెడ్తుంది. రెండోది కోరుకుంటే అది శాపం తెస్తుంది. అందుచేత జీవం కోరుకోండి. అప్పుడు మీరూ, మీ పిల్లలూ జీవిస్తారు.