ద్వితీ 4:32 - పవిత్ర బైబిల్32 “ఇంతకు పూర్వం యింత గొప్పది ఏమైనా జరిగిందా? ఎన్నడూ లేదు. గతాన్ని చూడండి, మీరు పుట్టక ముందు జరిగిన వాటన్నింటినీ గూర్చి ఆలోచించండి. భూమిమీద దేవుడు మనిషిని సృజించిన అనాది కాలానికి వెళ్లండి. ప్రపంచంలో ఎక్కడేగాని, ఎన్నడేగాని, జరిగిన వాటన్నింటినీ చూడండి. ఇంతటి గొప్ప విషయాన్ని గూర్చి ఎన్నడైనా ఎవరైనా విన్నారా? లేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటె ముందుగానుండినమునుపటి దినములలో ఆకాశముయొక్క యీ దిక్కునుండి ఆకాశముయొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 దేవుడు భూమి మీద నరుని సృజించిన రోజు నుండి, మీకంటే ముందు ఉన్న గత కాలం గురించి అడగండి; ఆకాశం యొక్క ఒక చివరి నుండి మరో చివరి వరకు అడగండి. ఇలాంటి గొప్ప కార్యం ఎప్పుడైనా జరిగిందా? లేదా అటువంటి దాని గురించి ఎప్పుడైనా విన్నారా? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 దేవుడు భూమి మీద నరుని సృజించిన రోజు నుండి, మీకంటే ముందు ఉన్న గత కాలం గురించి అడగండి; ఆకాశం యొక్క ఒక చివరి నుండి మరో చివరి వరకు అడగండి. ఇలాంటి గొప్ప కార్యం ఎప్పుడైనా జరిగిందా? లేదా అటువంటి దాని గురించి ఎప్పుడైనా విన్నారా? အခန်းကိုကြည့်ပါ။ |