ద్వితీ 4:31 - పవిత్ర బైబిల్31 మీ దేవుడైన యెహోవా కృపగల దేవుడు ఆయన మిమ్మల్ని విడిచి పెట్టడు. ఆయన మిమ్మల్ని నాశనం చేయడు. మీ పూర్వీకులకు ఆయన వాగ్దానం చేసిన ఒడంబడికను ఆయన మరచిపోడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 మీ దేవుడైన యెహోవా జాలిగల దేవుడు; కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, ఆయన మీ పూర్వికులతో ప్రమాణం ద్వార నిశ్చయం చేసిన నిబంధనను మరచిపోరు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 మీ దేవుడైన యెహోవా జాలిగల దేవుడు; కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, ఆయన మీ పూర్వికులతో ప్రమాణం ద్వార నిశ్చయం చేసిన నిబంధనను మరచిపోరు. အခန်းကိုကြည့်ပါ။ |
ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!” ఇదే యెహోవా వాక్కు. “నేను మిమ్మల్ని రక్షిస్తాను. నేనే మిమ్మల్ని ఆయా దేశాలకు చెదరగొట్టాను. కాని ఆ రాజ్యాలను నేను పూర్తిగా నాశనం చేస్తాను. ఇది నిజం. నేనా దేశాలను నాశనం చేస్తాను. కాని నేను మిమ్మల్ని మాత్రం నాశనం చేయను. అయితే మీరు చేసిన దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి. నేను మిమ్మల్ని బాగా క్రమశిక్షణలోకి తెస్తాను.”
యోనా యెహోవాపట్ల చిరాకుతో ఇలా అన్నాడు: “ఇది జరుగుతుందని నాకు తెలుసు! నేను నా దేశంలో ఉన్నప్పుడు నన్ను ఇక్కడికి రమ్మన్నావు. ఈ దుర్మార్గపు నగరవాసులను నీవు క్షమిస్తావని నాకు అప్పుడే తెలుసు. అందువల్లనే నేను తర్షీషుకు పారిపోవటానికి నిర్ణయించుకున్నాను. నీవు దయగల దేవుడవని నాకు తెలుసు! నీవు కరుణ చూపిస్తావనీ, నీవు ప్రజలను శిక్షింపగోరవనీ నాకు తెలుసు! నీ అంతరంగం కరుణతో నిండివుందనీ నాకు తెలుసు! వీరు పాపం చేయటం మానితే, వీరిని నాశనం చేయాలనే నీ తలంపు మార్చుకుంటావనీ నాకు తెలుసు.