Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 20:8 - పవిత్ర బైబిల్

8 “ఆ లేవీ అధికారులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ధైర్యం పోయి, భయపడ్తున్నవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అతడు తిరిగి ఇంటికి వెళ్లాలి. అప్పుడు అతడు మిగిలిన సైనికులుకూడా ధైర్యం కోల్పోయేటట్టు చేయకుండా ఉంటాడు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 నాయకులు జనులతో –యెవడు భయపడి మెత్తని గుండెగల వాడగునోవాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 సేనాధిపతులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ఎవడైనా భయపడుతూ ఆందోళనలో ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. అతడి భయం, ఆందోళనల వల్ల అతని సోదరుల గుండెలు కూడా అధైర్యానికి లోను కావచ్చు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 అధిపతులు చేయవలసిన హెచ్చరికలు, “ఎవనికైనా భయాందోళనలున్నాయా? అలాగైతే ఇంటికి వెళ్లిపోవచ్చు, లేకపోతే ఆ పిరికితనం మిగతా సైనికులకు కూడా వ్యాపిస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 అధిపతులు చేయవలసిన హెచ్చరికలు, “ఎవనికైనా భయాందోళనలున్నాయా? అలాగైతే ఇంటికి వెళ్లిపోవచ్చు, లేకపోతే ఆ పిరికితనం మిగతా సైనికులకు కూడా వ్యాపిస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 20:8
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

తరువాత ఎదోము నాయకులు భయంతో వణకిపోతారు. మోయాబు నాయకులు భయంతో వణకిపోతారు. కనాను ప్రజలు తమ ధైర్యం కోల్పోతారు.


కష్ట సమయాలలో నీవు బలహీనంగా ఉంటే అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే.


కానీ అతనితోకూడ వెళ్లినవారు, “ఆ మనుష్యులతో మనం పోరాడలేం. వాళ్లు మనకంటె చాల బలంగలవాళ్లు అన్నారు.


వారు ఎష్కోలు లోయవరకు వెళ్లారు. వారు ఆ దేశాన్ని చూశారు. వారే ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపర్చారు. యెహోవా ఇచ్చిన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ల నీయకుండా వారే అడ్డు చేసారు.


అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టుకొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు” అని అతనితో చెప్పాడు.


మోసపోకండి, “చెడు సహవాసం మంచివాణ్ణి చెడుపుతుంది.”


ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్లగలము? మన సోదరులు (పన్నెండుమంది) తెచ్చిన సమాచారంతో వారు మనల్ని భయపెట్టారు. అక్కడి మనుష్యులు మనకంటే పెద్దవాళ్లు, ఎత్తయినవాళ్లు. పట్టణాలు పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తు ఉన్నాయి. అక్కడ రాక్షసుల్లాంటి మనుష్యుల్ని మేము చూశాము’ అని వారు చెప్పారు.


తర్వాత అధికారులు సైన్యంతో మాట్లాడటం అయిపోయిన తర్వాత, సైన్యాన్ని నడిపించేందుకు సేనాధిపతులను వారు నియమించాలి.


“మీ సైన్యం మీ శత్రువుల మీదికి వెళ్లినప్పుడు, మిమ్మల్ని అపవిత్రపరచే వాటన్నింటికీ దూరంగా ఉండండి.


కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు.


నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మి వేయబోతున్నాను.


కనుక ఇప్పుడు నీ మనుష్యులకు ఒక ప్రకటన చెయ్యి. ‘భయపడేవారు ఎవరైనా సరే గిలాదు కొండ విడిచి పోవచ్చును. అలాంటి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోవచ్చును’ అని వారితో చెప్పుము” అని గిద్యోనుతో అన్నాడు. ఆ సమయంలో ఇరవైరెండు వేల మంది గిద్యోనును విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఇంకా పదివేల మంది మనుష్యులు మిగిలిపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ