ద్వితీ 17:3 - పవిత్ర బైబిల్3 వారు ఇతర దేవుళ్లను పూజించినట్టు మీరు వినవచ్చును. లేదా వాళ్లు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను పూజించినట్టు మీరు వినవచ్చును. అది యెహోవానైన నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు విరుద్ధం. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీయులలో జరిగియుండుట వాస్తవమైనయెడల အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఆ విషయం మీకు తెలిసిన తరువాత మీరు విచారణ జరిగించాలి. అది నిజమైతే, అంటే అలాంటి అసహ్యమైన పని ఇశ్రాయేలీయుల్లో జరగడం నిజమైతే အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే, အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే, အခန်းကိုကြည့်ပါ။ |
బయలు దేవతకు యూదా రాజులు ఉన్నత (పూజా) స్థలాలను నిర్మించినారు. ఆ స్థలాలను వారు తమ కుమారులను అగ్నిలో కాల్చి బయలు ముందు బలి అర్పించటానికి ఉపయోగించారు. బయలు దేవతకు వారి కుమారులను దహన బలులుగా అర్పించారు. అలా చేయమని నేనెన్నడూ వారికి చెప్పియుండలేదు. మీ కుమారులను బలియివ్వమని నేనెన్నడూ మిమ్మల్ని అడగలేదు. అటువంటి అకృత్యాన్ని నేను మనసులో కూడా ఎన్నడూ తలపోయలేదు.
మీ దేవుడైన యెహోవాతో మీరు చేసిన ఒడంబడికను నిలబెట్టుకొనేందుకు మీరు నిరాకరిస్తే ఇలా జరుగుతుంది. మీరు వెళ్లి ఇతర దేవుళ్లను పూజిస్తే మీరు ఈ దేశాన్ని పోగొట్టుకొంటారు. ఆ ఇతర దేవుళ్లను మీరు పూజించకూడదు. మీరు గనుక అలా చేస్తే మీ మీద యెహోవాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి మీరు వెంటనే వెళ్లగొట్టబడతారు.”