ద్వితీ 17:16 - పవిత్ర బైబిల్16 రాజు తనకోసం మరీ ఎక్కువ గుర్రాలను సంపాదించుకోకూడదు. ఇంకా గుర్రాలు తీసుకొని వచ్చేందుకు అతడు ఈజిప్టుకు మనుష్యులను పంపకూడదు. ఎందుకంటే ‘మీరు ఎప్పుడూ తిరిగి ఆ మార్గాన వెళ్లకూడదు’అని యెహోవా మీతో చెప్పాడు గనుక. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవా–ఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అతడు గుర్రాలను చాలా ఎక్కువగా సంపాదించుకోకూడదు. గుర్రాలను ఎక్కువగా సంపాదించడానికి ప్రజలను ఐగుప్తుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ దారిలో వెళ్లకూడదని మీతో చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అంతేకాక, రాజు గుర్రాలను అధిక సంఖ్యలో సంపాదించవద్దు, వాటిని ఇంకా ఎక్కువ సంపాదించుకునేందుకు ప్రజలను ఈజిప్టుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే, “మీరు మరలా ఆ త్రోవలో వెళ్లకూడదు” అని యెహోవా మీకు చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అంతేకాక, రాజు గుర్రాలను అధిక సంఖ్యలో సంపాదించవద్దు, వాటిని ఇంకా ఎక్కువ సంపాదించుకునేందుకు ప్రజలను ఈజిప్టుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే, “మీరు మరలా ఆ త్రోవలో వెళ్లకూడదు” అని యెహోవా మీకు చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။ |
దావీదు కుమారుడు అదోనీయా “నేనే రాజునౌతానని” అనుకొన్నాడు. (అదోనీయా తల్లి పేరు హగ్గీతు) అదోనీయా చాలా అందమైనవాడు. అతడు రాజు కావాలని మిక్కిలి ఉబలాటపడ్డాడు. అందువల్ల తనకు తానే ఒక రథాన్ని, గుర్రాలను సమకూర్చుకున్నాడు. తన ముందు పరుగెత్తుటకు ఏభై మంది మనుష్యులను కూడా నియమించాడు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టాడు. దావీదు రాజు ఎప్పుడూ అదోనీయాను మందలించలేదు, విమర్శించలేదు. “ఏమి చేస్తున్నావు?” అని కాని, “అది ఎందుకు చేశావు?” అని కాని అతడు ఎప్పుడూ అడగలేదు.
అందువల్ల ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా కొరకు దేవదారు వృక్షాలను పడగొట్టాలి. నా పనివాళ్లు నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు సీదోను వడ్రంగులకు సాటిరారు.”
అయినప్పటికీ ఈ క్రొత్త రాజు నెబుకద్నెజరుపై తిరుగుబాటు ప్రయత్నం చేశాడు! అతడు తన దూతలను ఈజిప్టుకు పంపి సహాయం అర్థించాడు. క్రొత్తరాజు అనేక గుర్రాలను, సైనికులను అడిగాడు. మరి ఈ నూతన యూదా రాజు విజయం సాధిస్తాడని ఇప్పుడు మీరనుకుంటున్నారా? ఒడంబడికను ఉల్లంఘించి, శిక్షనుండి తప్పించుకునేటంత శక్తి ఈ క్రొత్త రాజుకు ఉన్నదని మీరనుకుంటున్నారా?”