Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 17:11 - పవిత్ర బైబిల్

11 మీరు వారి తీర్మానాన్ని అంగీకరించి, వారి హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలి. మీరు చేయాలని వారు చెప్పేదానికి ఏదీ మీరు వ్యతిరేకంగా చేయకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పుచొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాటనుండి కుడికిగాని యెడమకుగాని నీవు తిరుగకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 వారు మీకు బోధించే చట్టాన్ని పాటించాలి. వారు ఇచ్చిన తీర్పు ప్రకారం జరిగించాలి. వారు మీకు చెప్పే మాట నుంచి కుడికిగాని ఎడమకుగాని తిరగకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 వారు మీకు బోధించిన, ఇచ్చిన నిర్ణయాల ప్రకారం మీరు చేయాలి. వారు మీకు చెప్పిన వాటినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 వారు మీకు బోధించిన, ఇచ్చిన నిర్ణయాల ప్రకారం మీరు చేయాలి. వారు మీకు చెప్పిన వాటినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 17:11
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

“విషయాలన్నీ మాట్లాడమని యోవాబు నీతో చెప్పాడా?” అని రాజు అడిగాడు. ఆ స్త్రీ ఇలా అన్నది: “నీ ప్రమాణంగా, నా ప్రభువైన రాజా, నీవు నిజం చెప్పావు. నీ సేవకుడైన యోవాబు ఇవన్నీ చెప్పమని నాతో అన్నాడు.


తిన్నని మార్గం విడిచిపెట్టకు అది మంచిది, సరైనది. కాని కీడు నుండి ఎల్లప్పుడూ తిరిగిపొమ్ము.


యెహోవా తన ఆజ్ఞలను మోషేకు ఇచ్చాడు, వాటిని మోషే ప్రజలకు ఇచ్చాడు. అహరోనూ, నీవు ఆ ఆజ్ఞలు అన్నింటి విషయమై ప్రజలకు ప్రబోధించాలి.”


అక్కడ యెహోవా ప్రత్యేక స్థలంలో వారు వారి తీర్మానాన్ని మీకు తెలియజేస్తారు. మీరు చేయాలని వారు మీకు చెప్పే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా చేయాలి.


అప్పుడు రాజు తన ప్రజలందరికంటే తానే గొప్పవాడ్ని అని తలంచడు. అతడు ధర్మశాస్త్రానికి దూరంగా తిరిగి పోకుండా, ఖచ్చితంగా దానిని పాటిస్తాడు. అప్పుడు ఆ రాజు, అతని సంతతివారు ఇశ్రాయేలు రాజ్యాన్ని చాలా కాలం పరిపాలిస్తారు.


“ఇద్దరు మనుష్యులకు వివాదం ఉంటే వారు న్యాయస్థానానికి వెళ్లాలి. న్యాయమూర్తులు వారి వివాదాన్ని విచారించి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం ప్రకటిస్తారు.


ఈ వేళ నేను మీకు ఇస్తున్న ప్రభోధాల్లో దేనినుండీ మీరు తప్పి పోకూడదు. మీరు కుడి ప్రక్కకు గాని ఎడమ ప్రక్కకు గాని తొలగిపోకూడదు. మీరు ఇతర దేవుళ్లను సేవించడానికి వారిని వెంబడించ కూడదు.


“అందుచేత యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేందుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్ణి అనుసరించటం మానకూడదు.


పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్లు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా ఉండమని, సత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండమని బోధించు.


అయితే నీవు మరో విషయంలో కూడ బలంగా, ధైర్యంగా ఉండాలి. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. అతని ప్రబోధాలను నీవు సరిగ్గా పాటిస్తే, నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలుగుతుంది.


“యెహోవా మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటికీ విధేయులుగా ఉండేందుకు మీరు జాగ్రత్తపడాలి. మోషే ధర్మశాస్రంలో వ్రాయబడిన వాటన్నింటికీ విధేయులుగా ఉండండి. ఆ ధర్మశాస్త్రానికి విముఖులు కావద్దు.


అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివాసుల్ని దూషించటానికి భయపడనివాళ్ళ విషయంలో యిది ముఖ్యంగా నిజమౌతుంది. ఇలాంటి దుర్బోధకులు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్ళను దూషిస్తారు.


వాళ్ళలాగే కలలుగనే ఈ దుర్బోధకులు తమ శరీరాల్ని మలినం చేసికొంటూ, అధికారాన్ని ఎదిరిస్తూ, దేవదూతల్ని దూషిస్తూ ఉంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ