Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 8:25 - పవిత్ర బైబిల్

25 “ఈ రాజు చాలా మోసగాడు, జిత్తులమారి అయివుండి, తన యుక్తి ఉపయోగించి, వంచనతో గెలుపొందుతాడు. తాను అతి ముఖ్యుడనని భావిస్తాడు. ప్రజలు క్షేమంగా ఉన్నామని తలస్తూన్నప్పుడు ఇతడు చాలా మందిని, రాజాధిరాజును సహితం ఎదిరిస్తాడు. అయినా ఇతడు నాశనం చేయబడతాడు, కాని మానవ శక్తివల్ల కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధముచేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 అతడు కుటిల బుద్ధితో మోసం ద్వారా వర్థిల్లుతాడు. అతడు రాజాధిరాజుతో సైతం యుద్ధం చేస్తాడు. అయితే చివరికి అతడు కూలిపోతాడు-కానీ అది మానవ బలం వల్ల జరగదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 అతడు యుక్తి గలవాడై మోసం చేసి తనకు లాభం కలిగేలా చూసుకుంటాడు. క్షేమంగా ఉన్నామని వారు అనుకున్నప్పుడు, అతడు ఎంతోమందిని నాశనం చేస్తాడు, రాజాధిరాజుతో యుద్ధం చేస్తాడు. కాని చివరకు అతడు నాశనమవుతాడు, అయితే మానవ శక్తి ద్వారా కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 అతడు యుక్తి గలవాడై మోసం చేసి తనకు లాభం కలిగేలా చూసుకుంటాడు. క్షేమంగా ఉన్నామని వారు అనుకున్నప్పుడు, అతడు ఎంతోమందిని నాశనం చేస్తాడు, రాజాధిరాజుతో యుద్ధం చేస్తాడు. కాని చివరకు అతడు నాశనమవుతాడు, అయితే మానవ శక్తి ద్వారా కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 8:25
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించవచ్చును. మనుష్యులను దేవుడు రోగులుగా చేస్తాడు. వారు మరణిస్తారు. ఏ కారణం లేకుండానే శక్తిగల మనుష్యులు మరణిస్తారు.


“యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది. కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి. మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు. ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు.


నా ప్రజల కుమార్తె (యెరూషలేము స్త్రీలు) చేసిన పాపం మిక్కిలి ఘోరమైనది. వారి పాపం సొదొమ, గొమొర్రాల పాపాలకు మించివుంది. సొదొమ, గొమొర్రా పట్టణాలు అకస్మాత్తుగా నాశనం చేయబడ్డాయి. ఏ మానవ హస్తమో చేసిన వినాశనం కాదది.


ఉత్తర సైన్యం ఓడిపోయి తీసుకొని పోబడుతుంది. దక్షిణ రాజు గర్విష్ఠి అవుతాడు. ఉత్తర సైన్యంలో వేలాది సైనికుల్ని హతమార్చుతాడు. కాని అతని విజయం కొనసాగదు.


సుందరమైన పరిశుద్ధ పర్వతానికి, సముద్రానికి మధ్య అతను రాజవైభవంగల గుడారాలు నెలకొల్పుతాడు. చివరికి అతడు నిస్సహాయుడై మరణిస్తాడు.


“‘కాని ఏమి జరగవలెనో, (దేవుని) న్యాయ స్థానమే నిర్ణయిస్తుంది. మరియు ఆ రాజుయొక్క అధికారము తీసివేయ బడుతుంది. వాని రాజ్యం సమూలంగా నాశనమవుతుంది.


“ఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు కుదురుతో సహా పెరికివేయబడ్డాయి. ఈ చిన్న కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికేనోరు దానికి ఉన్నాయి.


ఆ చిన్న కొమ్ము బాగా గర్వించి ఆ నక్షత్రాల సైన్యాధిపతికి ఎదురు తిరిగింది. అది పరిపాలకుని అనుదిన బల్యర్పణాన్ని ఆపివేసి. ఆయన ఆలయాన్ని పడగొట్టింది.


“కాబట్టి ఈ విషయం తెలుసుకొని గ్రహించుకో. యెరూషలేమును తిరిగి కట్టమని సందేశం బయలు వెళ్లిన సమయంనుండి, అభిషేకింపబడిన రాజు వరకు ఏడు వారాలు మరియు అరవైరెండు వారాలు. యెరూషలేము రాజవీధులతోను, కందకములతోను మరల కట్టబడుతుంది, కాని కష్ట సమయాల్లో అది కట్టబడుతుంది.


దేవునికి చెందవలసిన ఘనత అతడు అంగీకరించినందుకు ప్రభువు దూత అతణ్ణి తక్షణమే రోగంతో పడవేసాడు. పురుగులు పట్టి అతడు చనిపోయాడు.


మిమ్మల్ని ఎవ్వరూ ఏ విధంగా మోసం చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల తిరుగుబాటు జరిగి, ఆ నాశన పుత్రుడు, దుష్టుడు కనిపించేదాకా ఆ రోజు రాదు.


అప్పుడు ఆ భ్రష్టుడు కనిపిస్తాడు. యేసు ప్రభువు వాణ్ణి తన ఊపిరితో హతమారుస్తాడు. యేసు తేజోవంతంగా ప్రత్యక్షమై ఆ భ్రష్టుణ్ణి నాశనం చేస్తాడు.


వాళ్ళు గొఱ్ఱెపిల్లతో యుద్ధం చేస్తారు. కాని గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు. కనుక విజయం పొందుతాడు. ఆయన వెంట ఆయన పిలిచినవాళ్ళు, ఆయన ఎన్నుకొన్నవాళ్ళు, ఆయన్ని విశ్వసించేవాళ్ళు ఉంటారు.”


ఆయన వస్త్రంమీద, ఆయన తొడమీద: రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని వ్రాయబడి ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ