19 “తర్వాత ఆ నాలుగవ మృగంయొక్క అర్థం తెలుసుకోదలచాను. మిగిలిన మృగాలకంటె నాలుగవ మృగం భిన్నమైంది, మహా భయంకరంగా ఉండింది. దానికి ఇనుప పళ్లు, కంచు గోళ్లు ఉన్నాయి. అది తన బలి పశువుల్ని అన్నింటిని చీల్చి తిని, మిగిలినదాన్ని కాళ్ల క్రింద త్రొక్కి వేసింది.
19 ఇనుపదంతములును ఇత్తడి గోళ్లునుగల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొనగోరితిని; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మ్రింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
19 ఇనుప దంతాలు, ఇత్తడి గోళ్లు ఉన్న ఆ నాలుగవ జంతువు సంగతి ఏమిటో నేను తెలుసుకోవాలనుకున్నాను. అది మిగతా వాటికి పూర్తిగా వేరుగా ఉంది. చాలా భయంకరంగా, సమస్తాన్నీ పగలగొడుతూ మింగి వేస్తూ మిగిలిన దాన్ని కాళ్లతో తొక్కేస్తూ ఉంది.
19 “అప్పుడు నేను ఆ నాలుగవ మృగం గురించిన భావం తెలుసుకోవాలని కోరాను. అది మిగతా మృగాలన్నిటికంటే భిన్నంగా, అతి భయంకరంగా ఉంది, దాని పళ్లు ఇనుపవి, దాని పంజా ఇత్తడిది. ఆ మృగం దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది.
19 “అప్పుడు నేను ఆ నాలుగవ మృగం గురించిన భావం తెలుసుకోవాలని కోరాను. అది మిగతా మృగాలన్నిటికంటే భిన్నంగా, అతి భయంకరంగా ఉంది, దాని పళ్లు ఇనుపవి, దాని పంజా ఇత్తడిది. ఆ మృగం దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది.
నాలుగవ మృగం తలమీదవున్న పది కొమ్ముల గురించి తెలుసు కోవాలను కున్నాను. అక్కడ పెరిగిన చిన్న కొమ్ము గురించి తెలుసుకోదలిచాను. వాటిలో మూడు కొమ్ముల్ని చిన్న కొమ్ము పెరికివేసింది. ఇతర కొమ్ముల కంటె చిన్న కొమ్ము గొప్పదిగా, నీచంగా కనిపించింది. అది మానవ కన్నులవంటి కన్నులు కలిగియుండినది. అది డంబములు పలుకుతూనే ఉండినది.
“ఆ తర్వాత, నా దర్శనాలలో రాత్రివేళ చూస్తూండగా నా ఎదుట నాలుగవ మృగము ఉంది. ఇది చాలా ఘోరంగాను, భయంకరంగాను కనిపించింది. అది మహా బలంగా ఉంది. దానికి ఇనుప పళ్లు ఉన్నాయి. ఈ మృగం సమస్తాన్ని ముక్కలుగా చీల్చి మ్రింగుచూ, మిగిలిన దాన్ని తన కాళ్ల క్రింద త్రొక్కుచుండినది. అంతకు మునుపు నేను చూసిన ఇతర మృగాలకంటె ఈ నాలుగవ మృగం భిన్నంగా ఉంది. దీనికి పది కొమ్ములున్నాయి.
“ఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు కుదురుతో సహా పెరికివేయబడ్డాయి. ఈ చిన్న కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికేనోరు దానికి ఉన్నాయి.