Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 2:39 - పవిత్ర బైబిల్

39 “మరో రాజ్యం నీ తర్వాత వస్తుంది. అది వెండి లాంటిది. కాని ఆ రాజ్యం నీ రాజ్యంలా అంత గొప్పగా ఉండదు. ఆ తర్వాత మూడవ రాజ్యం భూమిని పరిపాలిస్తుంది. అది కంచు లాంటిది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

39 తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

39 మీరు మరణించిన తరవాత మీ రాజ్యం కంటే తక్కువ ప్రభావం ఉన్న మరో రాజ్యం పైకి వస్తుంది. తరువాత మూడో రాజ్యం సర్వలోకాన్ని పాలిస్తుంది. అది మీకు కనిపించిన ఇత్తడి వంటిది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

39 “మీ తర్వాత, మీకంటే తక్కువగా ఉన్న మరో సామ్రాజ్యం లేస్తుంది. దాని తర్వాత ఇత్తడి సూచనగా ఉన్న మూడవ సామ్రాజ్యం, లోకమంతటిని పరిపాలిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

39 “మీ తర్వాత, మీకంటే తక్కువగా ఉన్న మరో సామ్రాజ్యం లేస్తుంది. దాని తర్వాత ఇత్తడి సూచనగా ఉన్న మూడవ సామ్రాజ్యం, లోకమంతటిని పరిపాలిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 2:39
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా కోరేషుతో చెబుతున్నాడు, “నీవు నా గొర్రెల కాపరివి. నేను కోరిన వాటిని నీవు చేస్తావు. ‘నీవు మరల కట్టబడతావు’ అని యెరూషలేముతో నీవు చెబుతావు. ‘నీ పునాదులు మరల నిర్మించబడతాయి’” అని నీవు ఆలయంతో చెబుతావు.


అప్పుడు అతను, “దానియేలూ, నేను ఎందుకు నీవద్దకు వచ్చానో నీకు తెలుసా? నేను త్వరగా మరలి పోయి పారసీక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. నేను వెళ్లినప్పుడు, గ్రీకు యువరాజు వస్తాడు.


విగ్రహంయొక్క తల స్వచ్ఛమైన బంగారంతోను, రొమ్ము, చేతులు వెండితోను, పొట్ట, తొడలు కంచుతోను,


నీవు ప్రజల్ని, భూజంతువుల్ని, ఆకాశ పక్షుల్ని లోబరచుకొని, పరిపాలించే శక్తిని ఆయన నీకు ఇచ్చాడు. వాళ్లందరూ, అవన్నీ ఎక్కడున్నా, దేవుడు నీవు పరిపాలించేటట్లు చేశాడు. ఓ నెబుకద్నెజరు రాజా! ఆ విగ్రహపు బంగారు తల నీవే.


తర్వాత నాలుగవ రాజ్యం వస్తుంది. అది ఇనుములా శక్తివంతంగా ఉంటుంది. ఇనుము బ్రద్దలుచేసి ముక్కలు మక్కలుగా విరుగకొడుతుంది. ఆ విధంగానే, ఆ నాలుగవ రాజ్యం ఇతర రాజ్యాల్ని ముక్కలుగా పగులగొడుతుంది.


“అతను నాకిది వివరించాడు: ‘భూమిమీద అవతరించే నాలుగవ రాజ్యమే ఆ నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. ఆ నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణచివేస్తుంది.


“రెండు కొమ్ములు గల పొట్టేలును నీవు చూశావు. ఆ కొమ్ములు మాదీయ, పారసీక దేశాలు.


బొచ్చుగల మేకపోతు గ్రీకు రాజు, దాని కళ్ల మధ్యవున్న పెద్ద కొమ్ము మొదటి రాజు.


తెల్లగుర్రాలు మూడవ రథాన్ని లాగుతున్నాయి. మరియు ఎర్రమచ్చలున్న గుర్రాలు నాలుగో రథాన్ని లాగుతున్నాయి.


నల్లగుర్రాలు ఉత్తరానికి వెళతాయి. ఎర్రగుర్రాలు తూర్పుకు వెళతాయి. తెల్ల గుర్రాలు పడమటికి వెళతాయి. ఎర్ర మచ్చల గుర్రాలు దక్షిణానికి వెళతాయి.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ