దానియేలు 2:29 - పవిత్ర బైబిల్29 రాజా! నీ పడకమీద పడుకొని భవిష్యత్తులో ఏమి జరుగునో అని తలంచుచూ నీవు నిద్రించావు. గుప్త విషయాల గురించి దేవుడే చెప్పగలడు. భవిష్యత్తులో ఏమి జరుగునో దేవుడే నీకు చూపాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనోచింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవుదానిని తమరికి తెలియజేసెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 అది ఏమిటంటే, రాజా, మీరు పడక మీద పడుకుని, ప్రస్తుత కాలం గడచిన తరువాత ఏమి జరుగుతుందో అనుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో గుప్తమైన విషయాలను వెల్లడించేవాడు జరగబోయే సంగతులు మీకు తెలియజేశాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 “రాజా! మీరు పడుకున్నప్పుడు, రాబోయే సంగతుల గురించి మీరు ఆలోచిస్తుండగా, మర్మాలను తెలిపేవాడు జరగబోయే దానిని చూపించారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 “రాజా! మీరు పడుకున్నప్పుడు, రాబోయే సంగతుల గురించి మీరు ఆలోచిస్తుండగా, మర్మాలను తెలిపేవాడు జరగబోయే దానిని చూపించారు. အခန်းကိုကြည့်ပါ။ |
“నెబుకద్నెజరు రాజా, ఒక పర్వతంనుండి విరిగిన ఒక రాయిని నీవు చూశావు. అది మనిషి చేతులతో తీయబడింది కాదు. ఆ రాయి ఇనుమును, కంచును, బంకమట్టిని, వెండిని, బంగారాన్ని ముక్కలుగా విరుగగొట్టింది. ఈ విధంగా, దేవుడు భవిష్యత్తులో జరగనున్నదాన్ని నీకు చూపాడు. కల నిజం, దాని అర్థం నమ్మదగినది” అని దానియేలు రాజుతో చెప్పాడు.