దానియేలు 10:6 - పవిత్ర బైబిల్6 ఆయన శరీరం గోమేధికంవలె పసుపుగాను, ముఖం మెరుపువలె ప్రకాశవంతంగాను, కళ్లు ప్రకాశిస్తున్న దీపాలవలె కనిపించానియి చేతులూ, కాళ్లూ మెరుస్తున్న కంచువలెను, మాటల శబ్దం నర సమూహపు కంఠధ్వని వలెను ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అతని శరీరం కెంపు వర్ణంలో ఉంది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కళ్ళు జ్వాలామయమైన దీపాలు, అతని భుజాలు, పాదాలు తళతళలాడే ఇత్తడిలాగా ఉన్నాయి. అతని మాటల ధ్వని గొప్ప జనఘోష లాగా ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అతని శరీరం గోమేధికంలా, అతని ముఖం మెరుపులా, అతని కళ్లు మండే దివిటీలలా, అతని కాళ్లు చేతులు మెరుగుపెట్టిన ఇత్తడిలా తళతళలాడుతూ ఉన్నాయి. అతని కంఠస్వరం గుంపు చేసే ధ్వనిలా ఉంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అతని శరీరం గోమేధికంలా, అతని ముఖం మెరుపులా, అతని కళ్లు మండే దివిటీలలా, అతని కాళ్లు చేతులు మెరుగుపెట్టిన ఇత్తడిలా తళతళలాడుతూ ఉన్నాయి. అతని కంఠస్వరం గుంపు చేసే ధ్వనిలా ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |
పిమ్మట నేను ఆ రెక్కల చప్పుడు విన్నాను. జంతువులు కదలినప్పుడల్లా, ఆ రెక్కలు గొప్ప శబ్దం చేసేవి. మహా నీటి ప్రవాహం ఘోషించినట్లు వాటి రెక్కల చప్పుడు వినిపించింది. సర్వశక్తిమంతుడైన దేవుని గంభీర శబ్దంలాగ ఆ శబ్దం వినిపించింది. ఒక సైన్యంగాని, ఒక ప్రజా సమూహంగాని చేసే రణగొణధ్వనుల్లా అవి వినవచ్చాయి. ఆ జంతువులు కదలటం మానినప్పుడు అవి వాటి రెక్కలను తమ ప్రక్కలకు దించివేసేవి.