ఆమోసు 9:9 - పవిత్ర బైబిల్9 ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ ఇస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదర గొడతాను. కాని అది పిండిని జల్లించువాని రీతిగా ఉంటుంది. ఒక వ్యక్తి జల్లెడలో పిండిని జల్లిస్తాడు. అప్పుడు మెత్తని పిండి క్రిందికి దిగుతుంది. కాని బరక పిండి జల్లెట్లో మిగిలిపోతుంది. యాకోబు వంశం విషయంలోకూడ ఇదేరీతి జరుగుతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నేనాజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని యొక చిన్నగింజైన నేల రాలదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 “చూడండి. నేనొక ఆజ్ఞ ఇస్తాను. ఒకడు ధాన్యాన్ని జల్లెడలో పోసి ఒక్క గింజ కూడా కింద పడకుండా జల్లించినట్టు, ఇశ్రాయేలీయులను అన్ని రాజ్యాల మధ్యకు జల్లిస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “నేను ఆజ్ఞ ఇస్తాను, మనిషి ధాన్యం జల్లెడలో వేసి, ఒక్క గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా, ఇశ్రాయేలు ప్రజలను అన్ని దేశాల వారి మధ్య జల్లిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “నేను ఆజ్ఞ ఇస్తాను, మనిషి ధాన్యం జల్లెడలో వేసి, ఒక్క గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా, ఇశ్రాయేలు ప్రజలను అన్ని దేశాల వారి మధ్య జల్లిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా ఇలా అంటున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, భయపడకు. నేను నీతో వున్నాను. నిన్ను అనేక ఇతర దేశాలకు నేను పంపియున్నాను. ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను. కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను. నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి. కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను. నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”
నగరంలో నీ ప్రజలలో మూడవ వంతు వ్యాధిపీడితులై ఆకలితో చనిపోతారు. నీ ప్రజలలో మూడవ వంతు నగరం వెలుపల యుద్ధంలో చనిపోతారు. అప్పుడు నా కత్తిని బయటికిలాగి మీలో మరొక మూడో వంతు మందిని దూర దేశాలకు తరిమి వేస్తాను. నీ చుట్టూ ఉన్న ప్రజలు యుద్ధంలో వారిని చంపివేస్తారు! అప్పుడు మాత్రమే నేను నీ పట్ల నా కోపాన్ని ఉపసంహరించుకుంటాను.