Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 9:12 - పవిత్ర బైబిల్

12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు, మరియు నా పేరుమీద పిలువబడే జనులందరూ సహాయం కొరకు యెహోవావైపు చూస్తారు.” యెహోవా ఈ మాటలు చెప్పాడు. అవి జరిగేలా ఆయన చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 వాళ్ళు ఎదోములో మిగిలిన వారిని నా పేరు పెట్టుకున్న రాజ్యాలన్నీ నా ప్రజలు స్వాధీనం చేసుకునేలా చేస్తాను. ఇలా చేసే యెహోవా ప్రకటన ఇదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 అలా వారు ఎదోము జనంలో మిగిలిన వారిని, నా నామం కలిగిన యూదేతరులనందరినీ స్వాధీనం చేసుకుంటారు,” అని ఈ కార్యాలన్ని చేసే యెహోవా అంటున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 అలా వారు ఎదోము జనంలో మిగిలిన వారిని, నా నామం కలిగిన యూదేతరులనందరినీ స్వాధీనం చేసుకుంటారు,” అని ఈ కార్యాలన్ని చేసే యెహోవా అంటున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 9:12
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, జనములు నీకు సాగిలపడుదురు గాక, నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, “నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడతాడు, నిన్ను ఆశీర్వదించే ప్రతీ వ్యక్తి ఆశీర్వదించబడతాడు.”


“లేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. నీ మీద పరిపాలన చేసే అధికారం యాకోబుకు నేనిచ్చాను. అతని సోదరులంతా అతని సేవకులవుతారని కూడా నేను చెప్పాను. ధాన్యం, ద్రాక్షారసం, సమృద్ధిగా కలిగే అశీర్వాదం కూడా నేను అతనికి యిచ్చాను. నీకు ఇచ్చేందుకు యింకేమీ మిగల్లేదు కుమారుడా” అని జవాబిచ్చాడు ఇస్సాకు.


మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను. ఎదోము నా చెప్పులు మోసే బానిసగా ఉంటుంది. ఫిలిష్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”


అయితే ఎఫ్రాయిము, యూదా కలిసి ఫిలిష్తీయుల మీద దాడిచేస్తారు. ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఒక చిన్న జంతువును పట్టుకొనేందుకు, క్రిందగా ఎగిరే రెండు పక్షుల్లా ఉంటారు. వారిద్దరూ కలిసి తూర్పు ప్రజల ఐశ్వర్యాలు దోచుకొంటారు. ఎదోము, మోయాబు, అమ్మోను ప్రజలను ఎఫ్రాయిము, యూదా తమ ఆధీనంలో ఉంచుకొంటారు.


నా ప్రజలందరినీ, నా నామం పెట్టబడిన మనుష్యులందరినీ నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే సృష్టించుకొన్నాను. వాళ్లను నేనే సృష్టించాను. వాళ్లు నావాళ్లు.”


కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు. ఆ ప్రజలు నీ నామం ధరించరు. మరియు మేము ఆ ప్రజల్లాగే ఉన్నాము.


యెహోవా చెబుతున్నాడు: “సలహాకోసం నా వద్దకు రాని ప్రజలకు నేను సహాయం చేశాను. నన్ను కనుగొన్నవారు నాకోసం వెదకిన వారు కారు. నా పేరు పెట్టబడని ఒక ప్రజతో నేను మాట్లాడాను. ‘నేనిక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను’ అని నేను చెప్పాను.


ఆకస్మికంగా దాడి చేయబడిన వ్యక్తిలా ఉన్నావు. ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడైన సైనికునిలా ఉన్నావు. అయినా నీవు మాతో ఉన్నావు. యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ ఉన్నాము. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి పెట్టవద్దు!”


నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుతున్నాను. నీ వాక్కు నన్ను మిక్కిలి సంతోషపర్చింది. నా సంతోషానికి కారణమేమంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ పేరు సర్వశక్తిమంతుడు.


మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు నేను అమ్మివేస్తాను. అప్పుడు వారు ఇంకా దూరంలో ఉన్న షెబాయీము ప్రజలకు అమ్మివేస్తారు.” ఆ విషయాలు యెహోవా చెప్పాడు.


ఒకవేళ ఎదోము ప్రజలు, “మేము నాశనం చేయబడ్డాం. కానీ మేము తిరిగి వెళ్లి, మా పట్టణాలు మరల కట్టుకొంటాం” అని అనవచ్చు. అయితే సర్వశక్తిమంతుడైన యెహోవా, “వారు ఆ పట్టణాలను మరల నిర్మిస్తే, నేను వాటిని మరల నాశనం చేస్తాను” అని చెపుతున్నాడు. కనుక ఎదోము దుష్ట పట్టణం అని ప్రజలు చెబుతారు. ఆ దేశాన్ని యెహోవా శాశ్వతంగా అసహ్యించుకొంటున్నాడు అని ప్రజలు చెబుతారు.


మిగతా వాళ్ళంతా ప్రభువును వెతుకుతారు! నేనెన్నుకొన్న యూదులుకాని ప్రజలు కూడా వెతుకుతారు.’


‘అని ప్రభువు చాలా కాలం క్రిందటే తెలియచేసాడు.’


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ