Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 8:8 - పవిత్ర బైబిల్

8 ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది. దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి కొరకు విలపిస్తాడు. ఈజిప్టులోని నైలు నదిలా భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతనమవుతుంది. భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఇందునుగూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 దీన్ని బట్టి భూమి కంపించదా? అందులో నివసించే వారంతా దుఃఖపడరా? నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశపు నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 “ఈ కారణంచేత భూమి కంపించదా? దేశవాసులందరూ దుఃఖపడరా? నైలు నది పొంగినట్లు దేశమంతా పొంగుతుంది, అది పైకి లేచి తర్వాత ఈజిప్టు నదిలా అణగిపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 “ఈ కారణంచేత భూమి కంపించదా? దేశవాసులందరూ దుఃఖపడరా? నైలు నది పొంగినట్లు దేశమంతా పొంగుతుంది, అది పైకి లేచి తర్వాత ఈజిప్టు నదిలా అణగిపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 8:8
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు. భూమి కంపించి వణికినది. పర్వతాలు కంపించాయి. ఎందుకంటే ప్రభువు కోపించాడు.


అందుచేత యెహోవా తన ప్రజల మీద చాలా కోపగించాడు. యెహోవా తన చేయి పైకెత్తి, వాళ్లను శిక్షిస్తాడు. పర్వతాలు సహా భయపడి పోతాయి. చచ్చిన శవాలు చెత్తలా వీధుల్లో పడి ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన హస్తం ఇంకా పైకెత్తబడిఉంటుంది.


ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి? ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి? దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి. ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం. పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బ్రతకడు” అని ఆ దుర్మార్గులే అంటున్నారు.


నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు? పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు?


పొంగి ప్రవహించే నైలు నదిలా వచ్చేది ఈజిప్టు దేశమే. మహా వేగంతో ప్రవహించే మహా నదిలా వచ్చేది ఈజిప్టు దేశమే. ‘నేను వచ్చి భూమిని కప్పివేస్తాను. నేను నగరాలను, వాటి నివాసులను నాశనం చేస్తాను’ అని ఈజిప్టు అంటున్నది.


బాధలో వున్నట్లు ఆ రాజ్యం వణికిపోతుంది. యెహోవా తన పధకాన్ని అమలుపర్చటం మొదలు పెట్టినప్పుడు అది కంపించిపోతుంది. బబులోనును వట్టి ఎడారిగా మార్చటమే యెహోవా సంకల్పం. అక్కడ ఎవ్వరూ నివసించరు.


అరవై రెండు వారాల తర్వాత అభిషేకింపబడిన రాజు చంపబడతాడు. అప్పుడు రాబోయే రాజుయొక్క ప్రజలు నగరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేస్తారు. దాని అంతం ఒక ప్రళయంతో వస్తుంది. అంతం వరకు యుద్ధం కొనసాగుతుంది. నాశనాలు జరగటానికి ఆజ్ఞాపించబడ్డాయి.


సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను పూజిస్తారు. ఆ ప్రజలు, యాజకులు నిజంగా ఏడుస్తారు. ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకుపోబడింది.


అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి.


మీ పండుగ దినాలను చనిపోయినవారి కొరకు దుఃఖించే దినాలుగా మార్చుతాను. మీ పాటలన్నీ మృతులకొరకు విలాప గీతాలవుతాయి. ప్రతివానిపైన విషాద సూచిక దుస్తులు వేస్తాను. ప్రతివాని తలను బోడితల చేస్తాను. ఏకైక పుత్రుడు చనిపోయినప్పుడు కలిగే గొప్ప దుఃఖంలాంటి దుఃఖాన్ని నేను కలిగిస్తాను. అది ఒక భయంకరమైన అంతం.”


నా ప్రభువును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా భూమిని తాకితే, అది కరిగిపోతుంది. అప్పుడు భూమిపై నివసించేవారంతా చనిపోయినవారి కొరకు విలపిస్తారు. ఈజిప్టులో నైలు నదిలా భూమి పెల్లుబికి పడుతుంది.


ఆయన తన శత్రువులను సర్వనాశనం చేస్తాడు. ఆయన వరదలా వారిని తుడిచి పెడతాడు. ఆయన తన శత్రువులను అంధకారంలోకి తరిమి వేస్తాడు.


“అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ