ఆమోసు 8:5 - పవిత్ర బైబిల్5 వర్తకులారా, మీరిలా అంటారు, “మేము ధాన్యాన్ని అమ్ముకొనేటందుకు అమావాస్య ఎప్పుడు వెళ్లిపోతుంది? అమ్మకానికి మా గోధుమలు తేవటానికి విశ్రాంతిదినం ఎప్పుడైపోతుంది? కొలతలు తగ్గించి, ధరలు పెంచుతాము. దొంగత్రాసు వేసి ప్రజలను మోసగిస్తాము. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 –తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొనువారలారా, အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 వారిలా అంటారు, “మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో? గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో? మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం. తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అలా చేస్తూ, “మనం ధాన్యం అమ్ముకోడానికి, అమావాస్య ఎప్పుడు దాటి పోతుందో, గోధుమ వ్యాపారం సాగటానికి విశ్రాంతి దినం ఎప్పుడు గతించి పోతుందో?” అనుకునేవారలారా వినండి. మీరు కొల గంపలు చిన్నగా చేస్తూ, ధర ఎక్కువ చేస్తూ, దొంగ త్రాసుతో మోసగిస్తారు, အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అలా చేస్తూ, “మనం ధాన్యం అమ్ముకోడానికి, అమావాస్య ఎప్పుడు దాటి పోతుందో, గోధుమ వ్యాపారం సాగటానికి విశ్రాంతి దినం ఎప్పుడు గతించి పోతుందో?” అనుకునేవారలారా వినండి. మీరు కొల గంపలు చిన్నగా చేస్తూ, ధర ఎక్కువ చేస్తూ, దొంగ త్రాసుతో మోసగిస్తారు, အခန်းကိုကြည့်ပါ။ |
సబ్బాతు విషయంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవు పాపం చేయటం మానివేసినప్పుడు అది జరుగుతుంది. మరియు ఆ ప్రత్యేక రోజున నీ సంతోషం కోసం నీవు పనులు చేయటం మాని వేసినప్పుడు ఆది జరుగుతుంది. సబ్బాతు సంతోష దినంగా నీవు ఎంచుకోవాలి. యెహోవా ప్రత్యేక రోజును నీవు గౌరవించాలి. మిగిలిన ప్రతిరోజూ నీవు చెప్పేవి, చేసేవి మానివేయటం ద్వారా నీవు ఆ ప్రత్యేక రోజును గౌరవించాలి.
ఆ బల్లమీది భోజనం మీకు ఇష్టంలేదు. ఆ భోజనాన్ని మీరు వాసన చూచి, తినుటకు నిరాకరిస్తారు. అది చెడిపోయిందని మీరు చెబుతారు. కానీ అది సత్యం కాదు. ఆ తర్వాత జబ్బువి, కుంటివి, గాయపర్చబడిన జంతువులను మీరు నాకోసం తెస్తారు. జబ్బు జంతువులను నాకు బలి అర్పణలుగా ఇచ్చేందుకు మీరు ప్రయత్నిస్తారు. కానీ మీ వద్దనుండి ఆ జబ్బు జంతువులను నేను అంగీకరించను.
అలాగే మీ ప్రత్యేక సంతోష సమయాల్లోకూడ మీరు బూరలు ఊదాలి. మీ ప్రత్యేక పండుగ దినాల్లోను, నెలల ఆరంభ దినాల్లోను మీ బూరలు ఊదండి. మీ దహన బలులు, మీ సమాధాన బలులు అర్పించేటప్పుడు మీ బూరలు ఊదండి. అది మీరు మీ దేవుని జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరమైన ఒక ప్రత్యేక విషయం. మీరు ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”