ఆమోసు 8:11 - పవిత్ర బైబిల్11 యెహోవా చెపుతున్నాడు: “చూడు, దేశంలో కరువు పరిస్థితిని నేను కల్పించే సమయం వస్తూవుంది. ప్రజలు ఆహారం కొరకు ఆకలిగొనరు. ప్రజలు నీటి కొరకు దప్పిగొనరు. కాని యెహోవా వాక్యాల కొరకు ప్రజలు ఆకలిగొంటారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 యెహోవా ప్రకటించేది ఇదే, “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో నేను ఈ దేశంలో కరువు పుట్టిస్తాను, ఆహారం నీళ్లు లేకపోవడం వల్ల కలిగే కరువు కాదు, యెహోవా వాక్కుల కరువు పుట్టిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో నేను ఈ దేశంలో కరువు పుట్టిస్తాను, ఆహారం నీళ్లు లేకపోవడం వల్ల కలిగే కరువు కాదు, యెహోవా వాక్కుల కరువు పుట్టిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |
“నన్నెందుకు ఇబ్బంది పెట్టావు? నన్నెందుకు పైకి రప్పించావు?” అన్నాడు సమూయేలు సౌలుతో. సౌలు, “నేను కష్టంలో వున్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వచ్చారు. దేవుడేమో నన్ను విడిచిపెట్టేసాడు. ఆయన నాకు ఇంకెంత మాత్రం జవాబు ఇవ్వటంలేదు. నాకు ఆయన స్వప్నంలోగాని, ప్రవక్తల ద్వారాగాని జవాబు ఇవ్వటం లేదు. అందుకే నేను నిన్ను పిలిపించాను. నా కర్తవ్యమేమిటో నీవు నాకు చెప్పాలి” అన్నాడు.