ఆమోసు 5:5 - పవిత్ర బైబిల్5 కాని బేతేలులో వెదకవద్దు. గిల్గాలుకు వెళ్లవద్దు. సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి. గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకుపోబడతారు. బేతేలు నాశనం చేయబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 బేతేలును ఆశ్రయించవద్దు. గిల్గాలులో అడుగు పెట్టవద్దు. బెయేర్షెబాకు పోవద్దు. గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు. బేతేలుకు ఇక దుఖమే.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.” အခန်းကိုကြည့်ပါ။ |
ఆ సమయాన యాజకులు బలులు యెరూషలేముకు తీసుకురాలేదు; ఆలయములో బలిపీఠం మీద వాటిని నివేదించలేదు. యూదా అంతటా నగరాలలో యాజకులు నివసించారు. ఆ నగరాలలో వారు ఉన్నత స్థానాలలో ధూపము వేసేవారు. బలులు సమర్పించేవారు. ఆ ఉన్నత స్థలాలు గెబానుండి బెయేర్షెబా వరకు అన్ని చోట్ల వుండేవి. మరియు యాజకులు ఆ పట్టణాలలో పులియని రొట్టెను సామాన్యులతో కలిసి తింటూ ఉన్నారు. యెరూషలేములో యాజకులకోసం ప్రత్యేకించబడిన స్థలంలో కాదు. కాని యోషీయా రాజు ఆ ఉన్నత స్థానాలను ధ్వంసము చేసి, యెరూషలేముకు ఆ యాజకులను తీసుకువచ్చాడు. యోషీయా యెహోషువ ద్వారానికి ఎడమ నున్న ఉన్నత స్థానాలను కూడా ధ్వంసము చేశాడు. (యెహోషువ ఆ నగరపు పాలకుడు).