Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 4:5 - పవిత్ర బైబిల్

5 పులియబెట్టిన పదార్థాన్ని స్తోత్రార్పణగా ఇవ్వండి. స్వేచ్ఛార్పణల విషయం అందరికీ చెప్పండి. ఇశ్రాయేలూ, నీవు ఈ పనులు చేయటానికి ఇష్టపడతావు. కావున నీవు వెళ్ళి వాటిని చేయి. యెహోవా చెప్పేది ఇదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణనుగూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయేలీయులారా, యీలాగున చేయుట మీకిష్టమైయున్నది; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 రొట్టెతో కృతజ్ఞత అర్పణ అర్పించండి. స్వేచ్ఛార్పణలు ప్రకటించండి. వాటి గురించి చాటించండి. ఇశ్రాయేలీయులారా, ఇలా చేయడం మీకిష్టం గదా. యెహోవా ప్రకటించేది ఇదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 పులిసిన రొట్టెను కృతజ్ఞతార్పణగా కాల్చండి మీ స్వేచ్ఛార్పణల గురించి ప్రకటించండి. ఇశ్రాయేలీయులారా, వాటి గురించి ప్రకటన చేయండి, ఇలా చేయడం మీకు చాలా ఇష్టం కదా” అని ప్రభువైన యెహోవా అంటున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 పులిసిన రొట్టెను కృతజ్ఞతార్పణగా కాల్చండి మీ స్వేచ్ఛార్పణల గురించి ప్రకటించండి. ఇశ్రాయేలీయులారా, వాటి గురించి ప్రకటన చేయండి, ఇలా చేయడం మీకు చాలా ఇష్టం కదా” అని ప్రభువైన యెహోవా అంటున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 4:5
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను. ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.


ఆమోజు కుమారుడు యెషయా దర్శనం ఇది. యూదాకు, యెరూషలేముకు సంభవించే సంగతులను దేవుడు యెషయాకు చూపించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదాకు రాజులుగా ఉన్న కాలవ్యవధిలో ఈ సంగతులను యెషయా చూశాడు.


దేవుడు అంటున్నాడు: “ఇంకా ఎందుకు మీరు నాకు బలులు అర్పిస్తూనే ఉన్నారు? మీ మేకల బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు వెక్కసం అయ్యాయి.


మీరీ పాపాలు చేసి, నా పేరుతో పిలవబడే ఈ ఆలయంలో నా ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? ఈ చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటానికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా?


మీరు దొంగతనాలు, హత్యలు చేస్తారా? వ్యభిచార పాపానికి ఒడిగడతారా? మీరు ఇతరులపై అకారణంగా నేరారోపణ చేస్తారా? బూటకపు బయలు దేవుణ్ణి ఆరాధిస్తారా? మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరిస్తారా?


ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రతి కళ్లం మీద నీవు నీ లైంగిక పాపం చేశావు.


“నా మట్టుకైతే ఇశ్రాయేలును చూస్తుంటే, ఎడారిలో ద్రాక్షాపళ్లు చూచినట్టు ఉంది. కాలం మొదట్లో అంజూరపు చెట్లమీద మొదటి పండ్లవంటివారు మీ పూర్వీకులు. అయితే వారు బయల్పెయోరుకు వచ్చారు. వారు మారిపోయారు-వారు ఏదో కుళ్ళిపోయినదానిలా ఉండిరి. వారు తాము ప్రేమించిన దారుణ విషయాల్లాగే (అబద్ధపు దేవుళ్లు) వారూ తయారయ్యారు.


ఆ రోజున అనగా ఆదివారంనాడు మీ యిండ్ల నుండి రెండు రొట్టెలు తీసుకొని రండి. ఆ రొట్టె నైవేద్యంకోసం. 4 పావులు గోధుమ పిండిలో, పులిసిన పదార్థం ఉపయోగించి ఆ రొట్టెలు తయారుచేయాలి. అది మీ ప్రథమ పంటల్లోనుంచి మీరు యెహోవాకు అర్పించే కానుక.


“మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను! నేను వాటిని అంగీకరించను! మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను!


మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా, నేను వాటిని స్వీకరించను! మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు నేను కనీసం చూడనైనా చూడను.


వాళ్ళ ఆరాధనలు వ్యర్థం! వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’” అని అన్నాడు.


“శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది.


“అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది.


పైగా వాళ్ళు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని లెక్కచెయ్యలేదు. కనుక దేవుడు వాళ్ళను వాళ్ళ నీచ బుద్ధికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు చెయ్యరాని పనులు చేసారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ