ఆమోసు 4:10 - పవిత్ర బైబిల్10 “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితమయ్యేలా చేశాను. కాని, మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు నేను ఐగుప్తీయులమీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని; మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యౌవనులను ఖడ్గముచేత హతముచేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు మీ మీదికి తెగుళ్లు పంపాను. మీ యువకులను కత్తితో చంపేశాను. మీ గుర్రాలను తీసుకుపోయారు. మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన మీ ముక్కుల్లోకి ఎక్కింది. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “నేను ఈజిప్టు మీదికి రప్పించినట్లు మీ మీదికి తెగుళ్ళు రప్పించాను. మీరు కొల్లగొట్టిన గుర్రాలతో పాటు మీ యువకులను కత్తితో చంపాను. మీ శిబిరాల పుట్టిన దుర్వాసన మీ ముక్కు పుటలను చేరింది. అయినా మీరు నా వైపుకు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “నేను ఈజిప్టు మీదికి రప్పించినట్లు మీ మీదికి తెగుళ్ళు రప్పించాను. మీరు కొల్లగొట్టిన గుర్రాలతో పాటు మీ యువకులను కత్తితో చంపాను. మీ శిబిరాల పుట్టిన దుర్వాసన మీ ముక్కు పుటలను చేరింది. అయినా మీరు నా వైపుకు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
“అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని హజయేలు అడిగాడు. “ఇశ్రాయేలు వారికి మీరేమి చెడుపనులు చేయగలరో తెలిసి నేను ఏడుస్తున్నాను. మీరు వారి బలమైన నగరాలను దగ్ధం చేస్తారు. ఖడ్గాలతో మీరు ఆ యువకులను చంపుతారు. వారి పసిపిల్లలను కూడా మీరు హతమారుస్తారు. మీరు వారి గర్భవతులను చీల్చి వేస్తారు” అని ఎలీషా సమాధానం చెప్పాడు.
మనుష్యులు అంతా చెడ్డవాళ్లే. అందుచేత యువకుల విషయం యెహోవాకు సంతోషం లేదు. వారి విధవలకు, అనాధలకు యెహోవా దయ చూపించడు. ఎందుకంటే, ప్రజలంతా చెడ్డవాళ్లే గనుక. దేవునికి విరోధమైన వాటిని మనుష్యులు చేస్తారు. మనుష్యులు అబద్ధాలు చెబుతారు. అందుచేత దేవుడు మనుష్యులమీద కోపంగానే ఉంటాడు. దేవుడు మనుష్యుల్ని శిక్షిస్తూనే ఉంటాడు.
లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను. ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు వెళ్ళేటట్టు నేను చేస్తాను. వారిలో కొందరు తూర్పు సముద్రానికి వెళ్తారు. మరి కొందరు పడమటి సముద్రానికి వెళ్తారు. ఆ ప్రజలు అంత భయంకరమైన పనులు చేశారు. కాని వారు చచ్చి కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు. అక్కడ భయంకరమైన కంపు కొడుతుంది!”