Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 3:6 - పవిత్ర బైబిల్

6 హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే ప్రజలు భయంతో వణుకుతారు. ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే, దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 3:6
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు.


ఎలీషా ఆ పెద్దలతో (నాయకులతో) మాట్లాడుతూండగా, దూత అక్కడికి వచ్చాడు. ఆ సందేశమిది: “యెహోవా నుండి ఈ కష్టం వచ్చింది. ఇంకా యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.”


నేనే వెలుగును కలిగించాను. మరి నేనే చీకటిని చేశాను. నేనే సమాధానం కలిగిస్తాను. నేనే కష్టాలు కల్గిస్తాను. నేను యెహోవాను నేనే ఈ సంగతులన్నింటిని చేస్తాను.


ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు. వారందరి గౌరవానికి నీవు అర్హుడవు. ప్రపంచ దేశాలలో చాలామంది జ్ఞానులున్నారు. కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు.


అయ్యయ్యో, నా దుఃఖం, ఆవేదనతో నేను మూలుగుచున్నాను. నేను బాధతో క్రుంగి పోతున్నాను. అయ్యో, నేను భయ భ్రాంతుడనయ్యాను. నాలో నా గుండె దద్దరిల్లుతూ ఉంది. నేను ప్రశాంతంగా ఉండలేను. ఎందువల్లనంటే నేను బూర ధ్వని విన్నాను. అది యుద్ధ నాదం. సైన్యాన్ని అది పిలుస్తోంది!


“ఈ వర్తమానాన్ని యూదా ప్రజలకు ప్రకటించుము: “యెరూషలేములో ప్రతి పౌరునికి తెలియజేయుము, ‘దేశమంతా బూర వూది’ బాహాటంగా ఇలా చెప్పుము, ‘మీరంతా కలిసి రండి! రక్షణకై మనమంతా బలమైన నగరాలకు తప్పించుకుపోదాం!’


నేనంటే మీరు నిజంగా భయపడటం లేదు.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది “మీరు నాముందు భయంతో కంపించాలి. సముద్రానికి తీరాన్ని ఏర్పరచిన వాడను నేనే. తద్వారా సముద్రజలాలు తమ పరిధిలో శాశ్వతంగా ఉండేలా చేశాను. అలల తాకిడికి సముద్రతీరం దెబ్బతినదు. అలలు ఘోషిస్తూ తీరాన్ని చేరుతాయి, కాని అవి దానిని దాటిపోవు.


బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి! యెరూషలేము నగరం నుండి పారిపోండి! తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి. బేత్‌హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి! ఉత్తర దిశ నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి. మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!


ఈ కావలివాడు శత్రుసైన్యాలు రావటం చూచి బూర ఊది ప్రజలను హెచ్చరిస్తాడు.


“గిబియాలో కొమ్ము ఊదండి. రామాలో బాకా ఊదండి. బేతావెను వద్ద హెచ్చరిక చేయండి. బెన్యామీనూ, శత్రువు నీ వెనుక ఉన్నాడు.


బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు. బోను మూసుకుపోతే, అది అందులో చిక్కుతుంది.


అది భద్రతా గోపురాలలో, సంరక్షిత పట్టణాలలో ప్రజలు బూరలూ, బాకాలూ వినే యుద్ధ సమయంలా ఉంటుంది.


అంతకు ముందు, పనివారిని పెట్టటానికి, జంతువులను బాడుగకు తీసుకోటానికి మనుష్యులవద్ద డబ్బు లేదు. పైగా మనుష్యులు రావటానికి, పోవటానికి కూడ క్షేమకరం కాని సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను.


దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు.


ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు.


కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ