ఇశ్రాయేలుని యూదాని హెచ్చరిక చేసేందుకు యెహోవా ప్రతి ప్రవక్తను, దీర్ఘదర్శిని ఉపయోగించాడు. “మీరు చేసే చెడు పనులకు అయిష్టత చూపండి. నా ఆజ్ఞలను చట్టాలను పాటించండి. మీ పూర్వికులకు నేనిచ్చిన ధర్మశాస్త్రమును మీరు అనుసరించండి. ఈ ధర్మశాస్త్రాన్ని నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అందించాను” అని యెహోవా చెప్పాడు.
ప్రజలు యెహోవా చట్టాలను అంగీకరించలేదు. తమ పూర్వికులతో యెహోవా చేసిన ఒడంబడికను అంగీకరింలేదు. వారు యెహోవా చేసిన హెచ్చరికలను పాటించలేదు. ఎందుకు విలువలేని విగ్రహములను వారు కొలిచారు, మరియు వారు ఎందుకు విలువలేనివారయ్యారు. తమ చుట్టూ వున్న జనాంగములవలె వారు ఆ ప్రజల చెడు జీవిత పద్దతిని అనుసరించారు. మరియు యెహోవా ఇశ్రాయేలు ప్రజలను, హెచ్చరించి, ఆ చెడు పనులు చేయవద్దని చెప్పాడు.
వారిని మళ్లీ సన్మార్గాన్ని అనుసరింప జేయటానికి యెహోవా వారివద్దకు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు ప్రజలను హెచ్చరించారు. అయినా ప్రజలు వారి హెచ్చిరికను పెడచెవిని పెట్టారు.
ఈ విషయాలన్నింటి మూలంగా, ఆ యజమాని, సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల మహాబలశాలి ఇలా చెబుతున్నాడు, “నా శత్రువులారా, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇంకెంత మాత్రం మీరు నాకు కష్టం కలిగించరు.
నేను చేప్పే విషయాలు నీవు వారికి తప్పక తెలియజేయాలి. వారు నీ మాట వినరని నాకు తెలుసు. పైగా నా పట్ల పాపం చేయటం వారు మానరు. ఎందువల్లనంటే వారు తిరుగబడే స్వభావం గలవారు.
ఇశ్రాయేలు పాపం చేసింది. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులోవున్న బలిపీఠాలనుకూడా నేను నాశనం చేస్తాను. బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద పడతాయి.
“ఎన్నటికీ మీ దేవుడైన యెహోవాను మరువకండి. ఇతర దేవుళ్లను పూజించి సేవించేందుకు ఎన్నడూ వాటిని అనుసరించవద్దు. మీరు అలా గనుక చేస్తే, ఈ వేళే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; నిశ్చయంగా మీరు నాశనం చేయబడతారు.
ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసినవాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము.
“యెహోవాయే మా దేవుడు. మళ్లీ చెబుతున్నాము. యెహోవాయే మా దేవుడు. మేము ఎందుకు ఇలా చేసామో దేవునికి తెలుసు. మీరు కూడ తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. మేము చేసినదానికి వీరు విచారణ జరుపవచ్చు. మేము చేసింది తప్పు అనే నమ్మకం మీకు కలిగితే, మీరు మమ్మల్ని చంపవచ్చు.