Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 1:7 - పవిత్ర బైబిల్

7 కావున గాజా ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 గాజాయొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 గాజా ప్రాకారాల మీద నేను అగ్ని పంపిస్తాను. అది వారి రాజ భవనాలను దహించి వేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 నేను గాజా ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 నేను గాజా ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 1:7
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

హిజ్కియా గాజాకి వెళ్లేదారి అంతటను ఆ చుట్టుప్రక్కల ప్రదేశంలోగల ఫిలిష్తీయులందరినీ ఓడించాడు. చిన్న పట్టణం మొదలుకొని పెద్ద నగరందాకా గల అన్ని ఫిలిష్తీయుల నగరాలను అతను ఓడించాడు.


ఫిలిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణాల చుట్టూ వున్న ప్రాకారాలను అతడు పడగొట్టాడు. అష్టోదు పట్టణానికి దగ్గరగాను, మరియు ఫిలిష్తీయులు నివసించే ప్రాంతాలలోను ఉజ్జియా కొన్ని పట్టణాలను నిర్మించాడు.


ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.


గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు. ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది. లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?


ఈజిప్టులో అగ్ని రగిలిస్తాను. దానితో దాని సహాయకులు నాశనమై పోతారు. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.


దేవుడు ఇలా చెప్పాడు, “మాగోగు మీదికి, తీరం వెంబడి నిర్భయంగా నివసిస్తున్న ప్రజల మీదికి అగ్నిని పంపిస్తాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకొంటారు.


కావున హజాయేలు ఇంటిలో (సిరియా) నేను అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని బెన్హదదు ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.


యెహోవా ఇది చెపుతున్నాడు: “గాజా ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలందరినీ చెరబట్టి, వారినిఎదోముకు బానిసలుగా పంపారు.


మరియు నేను అష్టోదులో సింహాసనంపై కూర్చున్నవానిని నాశనం చేస్తాను. అష్కెలోనులో రాజదండం ధరించిన రాజును నేను నాశనం చేస్తాను. నేను ఎక్రోను ప్రజలను నాశనం చేస్తాను. ఇంకా బతికివున్న ఫిలిష్తీయులు అప్పుడు మరణిస్తారు అని దేవుడైన యెహోవా చెపుతున్నాడు.”


గాజాలో ఏ ఒక్కడూ విడువబడడు. అష్కెలోను నాశనం చేయబడుతుంది. మధ్యాహ్నానికల్లా అష్డోదునుండి ప్రజలు బలవంతంగా వెళ్లగొట్టబడతారు. ఎక్రోను శూన్యం అవుతుంది!


మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో, “పగ తీర్చుకోవటం నా వంతు. నేను ప్రతీకారం తీసుకొంటాను” అని వ్రాయబడి ఉంది.


ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించే వాణ్ణి వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం యిచ్చేవాడ్ని నేనే; ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది వారి శిక్ష త్వరగా వస్తుంది గనుక.’


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ