Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 1:2 - పవిత్ర బైబిల్

2 ఆమోసు ఇలా అన్నాడు: “యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు. ఆయన గంభీర స్వరం యెరూషలేమునుండి గర్జిస్తుంది. గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండిపోతాయి. కర్మెలు పర్వతం సహితం ఎండిపోతుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 అతడు ప్రకటించినదేమనగా–యెహోవా సీయోనులోనుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండి పోవుచున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 అతడు ఇలా చెప్పాడు, “యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు. యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు. కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి. కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 ఆమోసు ఇలా చెప్పాడు: “యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారు యెరూషలేము నుండి ఉరుముతున్నారు; కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి, కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 ఆమోసు ఇలా చెప్పాడు: “యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారు యెరూషలేము నుండి ఉరుముతున్నారు; కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి, కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 1:2
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.


రాజ్యాలు భయంతో వణకుతాయి. యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.


ఒక రాజు కోపం సింహగర్జనలా ఉంటుంది. నీవు రాజుకు కోపం పుట్టిస్తే నీ ప్రాణం పోగొట్టుకుంటావు.


దేశం వ్యాధిగ్రస్తమై, చస్తూ ఉంది. లెబానోను చస్తూ ఉంది, షారోను లోయ ఎండిపోయి, ఖాళీగా ఉంది. బాషాను, కర్మెలులో ఒకప్పుడు అందమైన మొక్కలు పెరిగాయి కానీ ఆ మొక్కలు ఎదగటం మానేశాయి.


అరణ్యం వికసించే పూలతో నిండిపోయి దాని సంతోషాన్ని వ్యక్తం చేయటం మొదలు పెడ్తుంది. అరణ్యం ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెబానోను అరణ్యంలా, కర్మెలు పర్వతంలా, షారోనులోయలా అరణ్యం సౌందర్యంగా ఉంటుంది. ప్రజలంతా యెహోవా మహిమ చూస్తారు గనుక ఇలా జరుగుతుంది. ప్రజలు మన యెహోవా మాహాత్మ్యం చూస్తారు.


యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలుదేరుతున్నాడు. ఆయన యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న వానిలా ఉంటాడు. ఆయన చాలా ఉర్రూతలూగుతూంటాడు. ఆయన గట్టిగా కేకలు వేసి అరుస్తాడు. ఆయన తన శత్రువులను ఓడిస్తాడు.


ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి? ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి? దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి. ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం. పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బ్రతకడు” అని ఆ దుర్మార్గులే అంటున్నారు.


“యూదా రాజ్యం చనిపోయిన వారికొరకు రోధిస్తుంది. యూదా నగరాల ప్రజలు నానాటికీ బలహీనమౌతారు. వారు నేలమీద పడతారు. యెరూషలేము నుండి ఒక రోదన దేవుని వద్దకు వెళుతుంది.


“యిర్మీయా, ఈ వర్తమానం వారికి అందజేయి: ‘ఉన్నతమైన, పవిత్రమైన తన ఆలయం నుండి యెహోవా ఎలుగెత్తి చాటుతున్నాడు. యెహోవా తన పచ్చిక బీడు (ప్రజలు)కు వ్యతిరేకంగా చాటుతున్నాడు. ఆయన ద్రాక్షారసం తీసే వారిలా బిగ్గరగా కేకలేస్తున్నాడు.


హనన్యా! నీవు, నేను ప్రవక్తలం అవటానికి పూర్వం చాలా ముందు కాలంలో ప్రవక్తలుండినారు. చాలా దేశాలకు, మహా సామ్రాజ్యాలకు యుద్ధాలు, కరువులు, భయంకరమైన రోగాలు వస్తాయని వారు చెప్పియున్నారు.


“‘కాని ఇశ్రాయేలును మళ్లీ వాని స్వంత పొలాలకు తీసుకొని వస్తాను. అతడు కర్మేలు పర్వతం మీదను బాషాను భూముల్లోను పండిన పంటను తింటాడు. అతడు తిని, తృప్తి పొందుతాడు. ఎఫ్రాయిము మరియు గిలాదు ప్రాంతాలలో గల కొండల మీద అతడు తింటాడు.’”


నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే, నా బిడ్డలు వచ్చి నన్ను అనుసరిస్తారు. భయంతో కంపిస్తూ నా బిడ్డలు పశ్చిమ దిశనుంచి వస్తారు.


తన కూనల్ని కోల్పోయిన ఎలుగుబంటిలాగ నేను వాళ్లపైన దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే ఒక క్రూర మృగంలాగ ఉంటాను”


యెహోవా, సహాయంకోసం నీకు నేను మొరపెడుతున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా మార్చేసింది. పొలంలోని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చివేశాయి.


యెహోవా తన సైన్యాన్ని గట్టిగా పిలుస్తాడు. ఆయన విడిది చాలా విశాలమైంది. ఆ సైన్యం ఆయన ఆదేశాలకు లోబడుతుంది. ఆ సైన్యం చాలా శక్తిగలది. యెహోవా ప్రత్యేక దినం ఒక గొప్ప భయంకర దినం. ఏ మనిషీ దానిని ఆపు చేయలేడు.


యెహోవా దేవుడు సీయోనులోనుండి కేకవేస్తాడు. యెరూషలేమునుండి ఆయన కేక వేస్తాడు. మరియు ఆకాశం, భూమి కంపిస్తాయి. కాని యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమస్థానం. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్షేమస్థానంగా ఉంటాడు.


వారు కర్మెలు పర్వత శిఖరంలో దాగినా వారిని నేనక్కడ కనుగొంటాను. వారిని అక్కడ పట్టుకొని తీసుకొస్తాను. వారు నా నుండి సముద్ర గర్భంలో దాగటానికి ప్రయత్నించితే నేను పాముకు ఆజ్ఞ ఇస్తాను. అది వారిని కాటేస్తుంది.


యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, అది ఎండిపోతుంది. ఆయన నదులన్నీ ఇంకిపోయేలా చేస్తాడు! బాషానులోని, కర్మెలులోని సారవంతమైన భూములన్నీ ఎండి, నశించి పోతాయి. లెబానోనులోని పుష్పాలన్నీ వాడి పోతాయి.


మాయోనులో ఒక ధనవంతుడు నివసిస్తుండేవాడు. అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. ఏదో వ్యాపార రీత్యా అతడు కర్మెలులో ఉన్నాడు. కర్మెలులో అతడు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ