అందువల్ల హజాయేలు ఎలీషాని కలుసు కొనడానికి వెళ్లాడు. తనతో పాటు హజాయేలు కానుకలు తెచ్చాడు. దమస్కు నుండి అతడు అన్ని రకాల మంచి వస్తువులు తెచ్చాడు. వాటిని మోయడానికి 40 ఒంటెలు కావలసి వచ్చింది. హజాయేలు ఎలీషా వద్దకు పోయాడు. “నీ అనుచరుడైన సిరియా రాజు నన్ను నీ వద్దకు పంపించాడు. అతను జబ్బునుండి కోలుకొనునో లేదో అడగమని, నన్ను పంపెను,” అని హజాయేలు చెప్పాడు.