అపొస్తలుల 26:10 - పవిత్ర బైబిల్10 నేను యెరూషలేములో చేసింది అదే. ప్రధానయాజకులు యిచ్చిన అధికారంతో నేను చాలామంది పరిశుద్ధుల్ని కారాగారంలో వేసాను. వాళ్ళను చంపటానికి నేను అంగీకారం కూడా తెలిపాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధానయాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని; အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యెరూషలేములో నేనలాగే చేశాను. ప్రధాన యాజకుల వలన అధికారం పొంది, అనేకమంది పవిత్రులను చెరసాలల్లో వేశాను. వారిని చంపినప్పుడు సమ్మతించాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 యెరూషలేములో అలాగే చేశాను. ముఖ్య యాజకుని దగ్గర నుండి అధికారం పొందుకొని పరిశుద్ధులలో అనేకమందిని చెరసాలలో వేయించి, వారిని చంపినప్పుడు దానికి అంగీకారం తెలిపాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 యెరూషలేములో అలాగే చేశాను. ముఖ్య యాజకుని దగ్గర నుండి అధికారం పొందుకొని పరిశుద్ధులలో అనేకమందిని చెరసాలలో వేయించి, వారిని చంపినప్పుడు దానికి అంగీకారం తెలిపాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము10 యెరూషలేములో అలాగే చేశాను. ముఖ్యయాజకుని దగ్గర నుండి అధికారం పొందుకొని ప్రభువు యొక్క ప్రజలలో అనేకమందిని చెరసాలలో వేయించి, వారిని చంపినప్పుడు దానికి అంగీకారం తెలిపాను. အခန်းကိုကြည့်ပါ။ |
అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు. ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు.