2 థెస్సలొనీకయులకు 2:17 - పవిత్ర బైబిల్17 దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మంచి పనులు చేయటానికి, మంచి మాటలు ఆడటానికి, మీకు ధైర్యం కలుగజేయునుగాక! အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మన ప్రభు యేసు క్రీస్తు, తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహ పరచు గాక. మంచి పనులు చేయడానికి, మంచి మాటలు పలకడానికి మిమ్మల్ని సిద్ధ పరచు గాక. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటల్లో మిమ్మల్ని బలపరచును గాక. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటల్లో మిమ్మల్ని బలపరచును గాక. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము17 మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటలలో మిమ్మల్ని బలపరచును గాక. အခန်းကိုကြည့်ပါ။ |
అదే విధంగా సీయోనును యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. ఆ దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా తయారవుతుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు పాడుతారు.
మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు శాశ్వతంగా జీవించేవాడు, పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు: “నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను. అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను. ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను. హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.