Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 6:5 - పవిత్ర బైబిల్

5 దావీదు, మరియు ఇశ్రాయేలీయులందరూ యెహోవా ముందు రకరకాల వాద్య విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశేషములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 దావీదు, ఇశ్రాయేలీయులంతా దేవదారు చెట్టుకలపతో చేసిన రకరకాల సితారాలు, సన్నాయి వాయిద్యాలు, తంబురలు, మృదంగాలు, పెద్ద డప్పులు వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యం చేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, దేవదారు కర్రతో చేసిన చిరతలు, సితారలు, వీణలు, తంబురలు, డప్పులు, తాళాలు వాయిస్తూ తమ శక్తి అంతటితో యెహోవా ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, దేవదారు కర్రతో చేసిన చిరతలు, సితారలు, వీణలు, తంబురలు, డప్పులు, తాళాలు వాయిస్తూ తమ శక్తి అంతటితో యెహోవా ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 6:5
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాని ఇప్పుడు వీణ వాయించే వానిని తీసుకొని రమ్ము.” అని ఎలీషా చెప్పాడు. ఆ వ్యక్తి వీణ వాయించగానే, యెహోవా యొక్క శక్తి ఎలీషా మీదికి వచ్చింది.


దావీదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముందు తమ శక్తికొలది భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేస్తున్నారు. వారు భక్తిగీతాలు పాడుతూ, తంబుర, సితారాలను వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, మద్దెలలు వాయిస్తూ, బూరలు ఊదుతూ వేడుక చేస్తున్నారు.


ఇశ్రాయేలు ప్రజలు జయజయ ధ్వనులు చేస్తూ, పొట్టేలు కొమ్ములు, బాకాలు వూదుతూ, వీణలు, స్వరమండలాలు, తాళాలు వాయిస్తూ ఒడంబడిక పెట్టెను తీసుకొని వచ్చారు.


వారు మేళతాళాలతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆలయానికి వెళ్లారు.


బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే యెహోవా దేవుడు లేచాడు.


రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీత వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు.


కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించకపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!”


కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తి బూరల ధ్వనులు వినగానే మీరు బంగారు విగ్రహానికి సాష్టాంగపడి పూజించాలి.


అందువల్ల, కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తిబూరలు మొదలైన సంగీత వాద్యాల ధ్యనులు వినగానే రాజు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రహానికి అందరు, అన్ని దేశాలవాళ్లు, అన్ని భాషలవాళ్లు సాష్టాంగపడి పూజించారు.


మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడనుండి తొలగించండి. మీ స్వరమండలమునుండి వచ్చే సంగీతాన్ని నేను వినను.


మీరు స్వరమండలాలను వాయిస్తారు. దావీదువలె మీరు కనిపెట్టిన వాద్య విశేషాలపై సాధన చేస్తారు.


తరువాత నీవు ఫిలిష్తీయుల కోటవున్న గిబియ-ఎలోహిముకు వెళతావు. నీవు ఆ పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన విషయాలు చెబుతూ వస్తారు.


మాకు ఆజ్ఞ ఇవ్వుము. సితారాను వాయించగలవాని కోసం వెదుకుతాము. యెహోవా దగ్గరనుండి ఆ దుష్ట శక్తి నీ మీదికి వస్తే ఇతడు సితారా వాయిస్తాడు. అప్పుడు ఆ దుష్ట ఆత్మ నిన్ను విడిచిపెట్టేస్తుంది. నీకు ఊరట కలుగుతుంది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ