Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 18:18 - పవిత్ర బైబిల్

18 అబ్షాలోము బ్రతికివున్న రోజుల్లో రాజు లోయలో, ఒక స్తంభం నిర్మించాడు. అప్పుడు అబ్షాలోము ఇలా అన్నాడు: “నా పేరు చిరస్థాయిగా నిలవటానికి నాకు కుమారుడు లేడు” అందువల్ల ఆ స్తంభానికి తన పేరే పెట్టుకున్నాడు. ఆ స్తంభం ఈనాటికీ “అబ్షాలోము జ్ఞాపక చిహ్నం” అని పిలవబడుతూవుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షాలోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 అబ్షాలోము జీవించి ఉన్నప్పుడు తన పేరు నిలబెట్టడానికి తనకు కొడుకులు లేరు గనక అతడు బ్రదికి ఉన్నప్పుడే ఒక స్తంభం తెచ్చి దాన్ని తన పేరట నిలబెట్టి ఆ స్తంభానికి అతని పేరు పెట్టాడు. ఇప్పటికీ అది అబ్షాలోము స్తంభం అని పిలువబడుతూ ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 “నా పేరును కొనసాగించడానికి నాకు కుమారుడు లేడు” అని ఆలోచించిన అబ్షాలోము తాను బ్రతికి ఉన్నప్పుడే ఒక స్తంభం తీసుకెళ్లి తన పేరిట రాజుల లోయలో నిలబెట్టి, ఆ స్తంభానికి తన పేరు పెట్టుకున్నాడు, అది నేటి వరకు అబ్షాలోము స్థూపం అని పిలువబడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 “నా పేరును కొనసాగించడానికి నాకు కుమారుడు లేడు” అని ఆలోచించిన అబ్షాలోము తాను బ్రతికి ఉన్నప్పుడే ఒక స్తంభం తీసుకెళ్లి తన పేరిట రాజుల లోయలో నిలబెట్టి, ఆ స్తంభానికి తన పేరు పెట్టుకున్నాడు, అది నేటి వరకు అబ్షాలోము స్థూపం అని పిలువబడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 18:18
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం. ప్రపంచమంతటా మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలసి ఉంటాం.”


మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక ఆ స్థలం బాబెలు అని పిలువబడింది. కనుక ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.


కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే లోయలో అతణ్ణి కలుసుకొనేందుకు సొదొమ రాజు వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజు లోయ అంటారు.)


అబ్షాలోముకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు తామారు. తామారు సౌందర్యవతి.


నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము. తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.


శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది. వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.


నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీ కుటుంబం వారు ఎవరైనా ఇక్కడ సమాధి చేయబడ్డారా? నీవెందుకు ఇక్కడ సమాధి తయారు చేస్తున్నావు?” అని ఆ సేవకుడ్ని అడుగు. యెషయా చెప్పాడు, “ఈ మనిషిని చూడండి! ఎత్తయిన స్థలంలో అతడు తన సమాధి సిద్ధం చేసుకొంటున్నాడు. తన సమాధి కోసం అతడు బండను తొలుస్తున్నాడు.


యెహోవా ఇలా అంటున్నాడు: “యెహోయాకీను గురించి ఈ విషయం వ్రాసి పెట్టండి: ‘అతడు పిల్లలు లేని వానితో లెక్క! తన జీవిత కాలంలో యెహోయాకీను ఏమీ సాధించలేడు. అతని పిల్లలలో ఎవ్వడూ దావీదు సింహాసనం మీద కూర్చోడు. అతని సంతానంలో ఎవడూ యూదా రాజ్యాన్ని ఏలడు.’”


నాతును, దాని సమీపంలోని చిన్న పట్టణాలను నోబహు ఓడించాడు. తర్వాత ఆ స్థలానికి అతడు తన స్వంత పేరు పెట్టాడు.


మరునాటి తెల్లవారుఝామున సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్లాడు. కానీ అక్కడి ప్రజలు, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. తన గౌరవార్థం అక్కడ ఒక జ్ఞాపక స్తంభం నిలబెట్టడానికి సౌలు వెళ్లాడు. తర్వాత సౌలు అనేక చోట్లకు ప్రయాణం చేసి, చివరికి గిల్గాలు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడు” అని చెప్పారు. కనుక సౌలు ఉన్న చోటికే సమూయేలు వెళ్లాడు. సౌలు అమాలేకీయుల దగ్గర తీసుకున్నవాటిలో మొదటి భాగాన్ని అప్పుడే అర్పించాడు. సౌలు వాటిని దహనబలిగా యెహోవాకు అర్పిస్తున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ