2 సమూయేలు 15:27 - పవిత్ర బైబిల్27 యాజకుడు సాదోకుతో రాజు ఇంకా ఇలా అన్నాడు: “నీవు దీర్ఘదర్శివి. నగరానికి ప్రశాంతంగా వెళ్లు. నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును నీతో తీసుకొని వెళ్లు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యాజకుడైన సాదోకుతో ఇట్లనెను–సాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అతడు యాజకుడైన సాదోకుతో ఇంకా ఇలా చెప్పాడు. “దీర్ఘదర్శివైన సాదోకూ, నీకు మంచి జరుగుతుంది. నువ్వు నీ కొడుకు అహిమయస్సునూ, అబ్యాతారుకు కొడుకు యోనాతానునూ వెంటబెట్టుకుని పట్టణం వెళ్ళు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి. အခန်းကိုကြည့်ပါ။ |
“ఇది మంచి ఆలోచన! వెళదాం పద” అన్నాడు సౌలు. కనుక వారిద్దరూ కలసి దైవ జనుడుండే పట్టణం వైపు బయలుదేరి వెళ్లారు. సౌలు, “సేవకుడు ఆ పట్టణానికి కొండ ఎక్కి వెళ్తున్నారు. మార్గంలో వారు కొందరు యువతులను కలుసుకొన్నారు. వారు నీళ్లకోసం బయటికి వస్తున్నారు.” “దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా?” అని వారు ఆ యువతులను అడిగారు. (గతంలో ఇశ్రాయేలీయులు ప్రవక్తను, “దీర్ఘదర్శి” అని పిలిచేవారు. అందుచేత దేవుని నుండి వారు ఏదైనా అడిగి తెలుసుకోవాలనుకొంటే, “దీర్ఘదర్శి దగ్గరకు పోదాం పదండి” అనే వాళ్లు).