2 రాజులు 8:9 - పవిత్ర బైబిల్9 అందువల్ల హజాయేలు ఎలీషాని కలుసు కొనడానికి వెళ్లాడు. తనతో పాటు హజాయేలు కానుకలు తెచ్చాడు. దమస్కు నుండి అతడు అన్ని రకాల మంచి వస్తువులు తెచ్చాడు. వాటిని మోయడానికి 40 ఒంటెలు కావలసి వచ్చింది. హజాయేలు ఎలీషా వద్దకు పోయాడు. “నీ అనుచరుడైన సిరియా రాజు నన్ను నీ వద్దకు పంపించాడు. అతను జబ్బునుండి కోలుకొనునో లేదో అడగమని, నన్ను పంపెను,” అని హజాయేలు చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచి–నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు–నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపె నని చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 కాబట్టి హజాయేలు ఎలీషాకు కానుకగా దమస్కులో దొరికే మంచి వస్తువులను తీసుకుని వాటిని నలభై ఒంటెల మీద ఎక్కించి బయల్దేరాడు. హజాయేలు వచ్చి ఎలీషా ఎదుట నిలబడ్డాడు. “సిరియా రాజూ, నీ కొడుకులాంటి వాడూ అయిన బెన్హదదు తన రోగం నయమౌతుందా అని అడగడానికి నన్ను పంపాడు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 హజాయేలు బహుమానంగా దమస్కులోని శ్రేష్టమైన వస్తువులను తీసుకుని నలభై ఒంటెల మీద ఎక్కించి ఎలీషాను కలవడానికి వెళ్లాడు. అతడు వెళ్లి ఎలీషా ఎదుట నిలబడి, “మీ కుమారుడు, అరాము రాజైన బెన్-హదదు, ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడగమని నన్ను పంపాడు” అని చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 హజాయేలు బహుమానంగా దమస్కులోని శ్రేష్టమైన వస్తువులను తీసుకుని నలభై ఒంటెల మీద ఎక్కించి ఎలీషాను కలవడానికి వెళ్లాడు. అతడు వెళ్లి ఎలీషా ఎదుట నిలబడి, “మీ కుమారుడు, అరాము రాజైన బెన్-హదదు, ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడగమని నన్ను పంపాడు” అని చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။ |