2 రాజులు 8:4 - పవిత్ర బైబిల్4 దేవుని వ్యక్తికి (ఎలీషా) సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ ఉన్నాడు. రాజు ఈ విధంగా అడిగాడు: “దయచేసి ఎలీషా చేసిన గొప్ప కార్యాలను తెలుపు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి–ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఆ సమయంలో రాజు దేవుని మనిషి దగ్గర పని చేస్తున్న గేహజీతో “ఎలీషా చేసిన గొప్ప విషయాలను నాకు చెప్పు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఆ సమయంలో, దైవజనుని సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ, “ఎలీషా చేసిన గొప్పకార్యాలు నాకు చెప్పు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఆ సమయంలో, దైవజనుని సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ, “ఎలీషా చేసిన గొప్పకార్యాలు నాకు చెప్పు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |
ఎలీషా వద్దకు రాజు ఒక దూతను పంపించాడు. ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. మరియు పెద్దలు (నాయకులు) అతనితోపాటు ఉన్నారు. ఆ దూత అక్కడికి చేరుకోవడానికి ముందుగా, పెద్దల్ని ఉద్దేశించి అతను ఇలా అన్నాడు: “చూడండి, ఆ హంతకుని కుమారుడు (ఇశ్రాయేలు రాజు) నా తల నరికి వేసేందుకు మనుష్యులను పంపిస్తున్నాడు. ఆ దూత చేరగానే, తలుపు మూసివేయండి తలుపు పట్టుకుని, అతనిని లోపలికి రానివ్వకండి. నేనతని యజమాని అడుగులు అతని వెనుక వస్తున్నట్టు ఆ సవ్వడి మనకు వినిపించునుగదా.”