Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 7:9 - పవిత్ర బైబిల్

9 తర్వాత ఈ కుష్ఠరోగులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: “మనము తప్పు చేస్తున్నాము. నేడు మనకు మంచి వార్త కలదు. కాని మనము మౌనంగా ఉన్నాము. మళ్లీ సూర్యుడు వచ్చేంతవరకు మనము వేచివుంటే, మనము శిక్షింపబడతాము. ఇప్పుడే మనము వెళ్లిపోదాము. రాజు గారి భవనంలో వున్న మనష్యులకు చెపుదాము.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వారు–మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చటనుండినయెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 తరువాత వారు ఇలా చెప్పుకున్నారు. “మనం చేసేది మంచి పని కాదు. ఈ రోజు శుభవార్త చెప్పాల్సిన రోజు. కానీ మనం దాని విషయంలో మౌనంగా ఉన్నాం. తెల్లవారే వరకూ మనం ఇక్కడే ఉంటే మనకు శిక్ష తప్పదు. కాబట్టి ఇప్పుడు మనం రాజభవనంలో ఈ సంగతి తెలియజేద్దాం.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మనం చేసేది మంచిది కాదు. ఇది శుభవార్త కలిగిన రోజు, మనం ఎవరితో పంచుకోవడం లేదు! ఒకవేళ తెల్లవారే వరకు మనం ఆగితే, శిక్షకు గురవుతాము. కాబట్టి ఇప్పుడే వెళ్లి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం” అని చెప్పుకొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మనం చేసేది మంచిది కాదు. ఇది శుభవార్త కలిగిన రోజు, మనం ఎవరితో పంచుకోవడం లేదు! ఒకవేళ తెల్లవారే వరకు మనం ఆగితే, శిక్షకు గురవుతాము. కాబట్టి ఇప్పుడే వెళ్లి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం” అని చెప్పుకొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 7:9
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

నయమాను తన యజమాని (సిరియారాజు) వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకు ఆ అమ్మాయి చెప్పిన విషయలు నయమాను తెలిపాడు.


ఆ తరువాత కుష్ఠరోగులు వచ్చి, నగర ద్వారపాలకులతో చెప్పారు: “మేము సిరియావారి శిబిరాలకు వెళ్లాము. కాని మేము ఎవ్వరి గొంతు వినలేదు. అక్కడ ఎవ్వరూ లేరు. గుర్రాలు గాడిదలు ఇంకా కట్టివేయబడివున్నాయి. గుడారాలు అలాగేవున్నాయి. కాని మనుష్యులందరూ వెళ్లిపోయారు.”


నగర ద్వారం వద్ద నలుగురు కుష్ఠరోగులుండిరి. వారు ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకున్నారు: “కూర్చుని మరణించాడానికి నిరీక్షిస్తున్నామా?


సిరియనుల గుడారం వారు రథాలు, గుర్రాలు, సైన్యం వస్తున్న సవ్వడిని సిరియనుల సైన్యం వినేలా యెహోవా ఏర్పాటు చేశాడు. అందువల్ల సిరియనుల సైనికులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఇశ్రాయేలు రాజు హిత్తీయుల, ఈజీప్టీయుల రాజులను మనకు ప్రతికూలంగా జీతమిచ్చి వాడుకున్నాడు.”


శిబిరం ప్రారంభమైన చోటికి ఈ కుష్ఠరోగులు వచ్చారు. వారు ఒక గుడారంలోకి వెళ్లారు. వారు తిన్నారు; త్రాగారు. తర్వాత ఆ కుష్ఠరోగులు వెండి బంగారం వస్త్రాలు మొదలైన వాటిని తీసుకున్నారు. వెండి బంగారాలు వస్త్రాలను వారు దాచివేశారు. తర్వాత వెనక్కి వచ్చి మరొక గుడారంలో ప్రవేశించారు. ఈ గుడారం నుంచి వస్తువులను బయటికి చేరవేశారు. ఈ వస్తువులను కూడా వారు దాచివేశారు.


ఒక మంచి వాడు ఏడుసార్లు పడిపోయినా సరే, అతడు ఎల్లప్పుడూ మరల నిలబడతాడు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టంచేత ఓడించబడతారు.


ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే మొట్టమొదట సీయోనుకు చెప్పాను. ‘చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు’ అనే ఒక సందేశం ఇచ్చి ఒక సందేశహరుని యెరూషలేముకు నేను పంపించాను.”


శుభవార్తతో కొండల మీదుగా ఒక వార్తాహరుడు రావటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. “శాంతి ఉంది! మేము రక్షించబడ్డాం! మీ దేవుడే రాజు!” అని ఒక వార్తాహరుడు ప్రకటించగా వినటం అద్భుతం.


యూదా, చూడు! పర్వతాలమీదనుండి వస్తున్నది, అక్కడ చూడు. శుభవార్త తీసుకొని ఒక దూత ఇక్కడికి వస్తున్నాడు! శాంతి ఉన్నదని అతడు చెపుతున్నాడు! యూదా, నీ ప్రత్యేక పండుగలను జరుపుకో! యూదా, నీవు మాట ఇచ్చిన వాటిని నెరవేర్చు. దుష్ట జనులు మళ్లీ నీ మీద దాడి చేసి నిన్ను ఓడించలేరు! ఆ దుష్ట జనులందరూ నాశనం చేయబడ్డారు.


కానీ మీరు ఇలా చేయకపోతే, మీరు యెహోవా దృష్టిలో పాపం చేసినట్టే. మరియు మీ పాపం కోసం మీరు శిక్ష పొందుతారని గట్టిగా తెలుసుకోండి.


ఆ దేవదూత వాళ్ళతో, “భయపడకండి! మీకే కాక ప్రజలందరికి ఆనందం కలిగించే సువార్త తెచ్చాను.


మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ