6 సిరియనుల గుడారం వారు రథాలు, గుర్రాలు, సైన్యం వస్తున్న సవ్వడిని సిరియనుల సైన్యం వినేలా యెహోవా ఏర్పాటు చేశాడు. అందువల్ల సిరియనుల సైనికులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఇశ్రాయేలు రాజు హిత్తీయుల, ఈజీప్టీయుల రాజులను మనకు ప్రతికూలంగా జీతమిచ్చి వాడుకున్నాడు.”
6 ఎందుకంటే ఆ శిబిరంలో ఉన్న వారు గుర్రాలూ, రథాలూ పరిగెడుతున్నట్టూ మరో పెద్ద సైనిక దండు కదులుతున్నట్టూ శబ్దాలు వినేలా యెహోవా చేశాడు. దాంతో వారు “మనతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజునీ, ఐగుప్తీయుల రాజునీ తోడు తెచ్చుకున్నాడు” అని తమలో తాము చెప్పుకున్నారు.
6 ఎందుకంటే యెహోవా అరాము సైన్యానికి రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం వస్తున్న శబ్దం వినిపించేటట్టు చేశారు, అందువల్ల వారు ఒకరితో ఒకరు, “చూడండి, ఇశ్రాయేలు రాజు మనమీద దాడి చేయడానికి హిత్తీయుల రాజులను, ఈజిప్టు రాజులను తోడు తెచ్చుకున్నాడు!” అని చెప్పుకున్నారు.
6 ఎందుకంటే యెహోవా అరాము సైన్యానికి రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం వస్తున్న శబ్దం వినిపించేటట్టు చేశారు, అందువల్ల వారు ఒకరితో ఒకరు, “చూడండి, ఇశ్రాయేలు రాజు మనమీద దాడి చేయడానికి హిత్తీయుల రాజులను, ఈజిప్టు రాజులను తోడు తెచ్చుకున్నాడు!” అని చెప్పుకున్నారు.
అమ్మోనీయులు దావీదు రాజుతో శతృత్వం తెచ్చి పెట్టుకున్నామని తెలుసుకున్నారు. దానితో వారు సైన్యాన్ని సమకూర్చుకొనే ప్రయత్నంలో బేత్రెహోబు, సోబాలలోవున్న సిరియనులను జీతానికి పిలిపించుకొన్నారు. సిరియను కాల్బలము ఇరువది వేల వరకు వుంది. ఒక వెయ్యిమంది సైనికులతో సహా మయకా రాజును, టోబునుండి పన్నెండు వేలమందిని జీతానికి పిలిపించుకొన్నారు.
చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”
ఈజిప్టు నుండి తెచ్చిన రథం ఒక్కటికి ఆరు వందల తులాల వెండి, గుర్రం ఒక్కటికి నూట ఏబది తులాల వెండి చొప్పున చెల్లించేవారు. సొలొమోను గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు మరియు అరాము రాజులకు అమ్మెడివాడు.
ఇశ్రాయేలు అధికారులలో ప్రతియొక్కడూ తనని ఎదుర్కొన్న శత్రువును చంపివేశాడు. కావున అరామునుండి వచ్చినవారు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం వారిని తరిమికొట్టింది. రాజైన బెన్హదదు ఒక రథాశ్వము నెక్కి తప్పించుకున్నాడు.
నేనతనిలో ఒక ఆత్మను ప్రవేశపెడుతున్నాను. అతను ఒక వందతి వింటాడు. అప్పుడతను తన దేశానికి తిరిగి పారిపోతాడు. అతని దేశంలోనే ఒక ఖడ్గంతో అతను చంపబడేలా నేను చేస్తాను” అని యెషయా వారితో చెప్పాడు.
దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు. కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు. ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.
సహాయం కోసం ఈజిప్టుకు దిగి వెళ్తున్న ఆ ప్రజలను చూడండి. ప్రజలు గుర్రాల కోసం అడుగుతున్నారు. గుర్రాలు వారిని రక్షిస్తాయని వారనుకొంటున్నారు. ఈజిప్టు రథాలు, గుర్రాలపై సైనికులు వారిని కాపాడుతారని ఆ ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఆ సైన్యం చాలా పెద్దది. కనుక వారు క్షేమంగా ఉన్నాం అని ప్రజలు అనుకొంటున్నారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుడు) ప్రజలు విశ్వసించటం లేదు. ప్రజలు సహాయం కోసం యెహోవాను అడుగుట లేదు.
అలాగైనా సరే, నా యజమాని బానిసల్లో ఒక్కడిని, చివరికి ఒక చిన్న అధికారిని కూడా మీరు ఓడించలేరు. అందుచేత ఈజిప్టు సైనికుల మీద రథాల మీద ఎందుకు మీరు ఆధారపడతారు?
ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు. అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు. శత్రు దాడికి వారు తట్టుకోలేరు. వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది. వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.
పిమ్మట నేను ఆ రెక్కల చప్పుడు విన్నాను. జంతువులు కదలినప్పుడల్లా, ఆ రెక్కలు గొప్ప శబ్దం చేసేవి. మహా నీటి ప్రవాహం ఘోషించినట్లు వాటి రెక్కల చప్పుడు వినిపించింది. సర్వశక్తిమంతుడైన దేవుని గంభీర శబ్దంలాగ ఆ శబ్దం వినిపించింది. ఒక సైన్యంగాని, ఒక ప్రజా సమూహంగాని చేసే రణగొణధ్వనుల్లా అవి వినవచ్చాయి. ఆ జంతువులు కదలటం మానినప్పుడు అవి వాటి రెక్కలను తమ ప్రక్కలకు దించివేసేవి.
ఆ తరువాత కెరూబుల రెక్కల ధ్వని వెలుపలి ఆవరణమంతా వినబడ్డది. సర్వశక్తి మంతుడైన దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ శబ్దం ఉరుములాంటి స్వరంలా గంభీరంగా ఉంది. రెక్కల చప్పుడు చాలా దూరంలో గల బయటి ఆవరణ వరకు వినవచ్చింది.
ఫిలిష్తీయులంతా చాలా భయపడిపోయారు. మెరుపు దాడులను చేయగల దళంవారితో సహా శిబిరంలో ఉన్న వారంతా మిక్కిలిగా భయపడ్డారు. భూమి కూడ కంపించింది! వారు చాలా భయంతో వణకిపోయారు.
హిత్తీయుడైన అహీమెలెకుతోను, సెరూయా కుమారుడయిన అబీషైతోను దావీదు మాట్లాడి, “సౌలు పాళెములోనికి తనతో ఎవరు రాగలరని” అడిగాడు. (అబీషై అనేవాడు యోవాబు తమ్ముడు). “నీతో నేను వస్తా” అని అబీషై చెప్పాడు.