Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 7:1 - పవిత్ర బైబిల్

1 దేవుని సందేశం వినండి. యెహోవా చెప్పుచున్నాడు. “రేపు ఈపాటికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అది మరల చౌకగా దొరకుతుంది. సమారియ నగర ద్వారం వద్ద ఒక రూపాయికి ఒక బుట్ట సన్నని మేలు రకం పిండి, ఇంకొక రూపాయికి రెండు బుట్టల (సేరుల) యవలు అమ్మబడును.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను–యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా– రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 అప్పుడు రాజుతో ఎలీషా “యెహోవా చెప్తున్న మాట విను. యెహోవా చెప్తున్నదేమిటంటే, రేపు ఇదే సమయానికి షోమ్రోను పట్టణ ద్వారం దగ్గర ఒక తులం వెండికి నాలుగు కిలోల గోదుమ పిండీ, ఒక తులం వెండికి ఎనిమిది కిలోల యవలూ అమ్ముతారు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అందుకు ఎలీషా రాజుతో, “యెహోవా మాట విను. యెహోవా చెప్పే మాట ఇదే: రేపు ఇదే వేళకు షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు సమరయ ద్వారం దగ్గర అమ్ముతారు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 అందుకు ఎలీషా రాజుతో, “యెహోవా మాట విను. యెహోవా చెప్పే మాట ఇదే: రేపు ఇదే వేళకు షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు సమరయ ద్వారం దగ్గర అమ్ముతారు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 7:1
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాని మీకాయా యెహోవా తరపున మాట్లాడటం కొనసాగించాడు. మీకాయా ఇలా అన్నాడు: “వినండి! ఇవి యెహోవా చెప్పిన మాటలు. యెహోవా పరలోకంలో సింహాసనాసీనుడై వున్నట్లు చూశాను. దేవదూతలు ఆయనకు చేరువలో నిలబడియున్నారు.


అప్పుడు యెషయా హిజ్కియాతో ఇట్లన్నాడు: “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము విను.


బయల్షాలిషా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మొదటి పంటవల్ల లభించిన ఇరవై యవల రొట్టెలు, క్రొత్త ధాన్యపు కంకులను, కొన్ని పండ్లను దైవజనునికి ఇచ్చాడు. ఎలీషా అప్పుడు, “వీటిని వారికి ఆహారంగా ఇవ్వండి” అన్నాడు.


నగరంలోకి ప్రజలు ఆహారం తీసుకురాకుండా సైనికులు చేశారు. అందువల్ల షోమ్రోనులో భయంకరమైన కరువు ఏర్పడింది. అది యెంత కష్టకాలమంటే, ఒక గాడిద తల ఎనభై వెండి రూపాయిలకు మరియు పావురపు పావు రెట్ట ఐదు వెండి రూపాయిలకు అమ్మబడింది.


ఎలీషా ఆ పెద్దలతో (నాయకులతో) మాట్లాడుతూండగా, దూత అక్కడికి వచ్చాడు. ఆ సందేశమిది: “యెహోవా నుండి ఈ కష్టం వచ్చింది. ఇంకా యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.”


తర్వాత ఆ ఇశ్రాయేలీయులు సిరియను శిబిరానికి పరిగెత్తుకుని వెళ్లి, అక్కడినుండి విలువగల వస్తువులు తీసుకున్నారు. ప్రతి ఒక్కనికి వస్తువులు సమృద్ధిగా వున్నాయి. అందువల్ల యెహోవా చెప్పినట్లుగానే అది జరిగింది. ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్ట మరియు ఒక్క రూపాయికి రెండు బుట్టల యవలు అమ్మబడెను.


ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు. సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.


కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు!


“ఇశ్రాయేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక నేను చెబుతున్న నా మాటలు వారికి చెప్పు. ‘రాత్రివేళ మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావాల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవచ్చని మీరు తెలుసుకొంటారు.’”


కనుక రేపు నా ప్రజల్ని నీ ప్రజల కంటే వేరుగా చూస్తాను. అదే నా రుజువు.”


సొదొమ నాయకులారా, యెహోవా సందేశం వినండి. గొమొర్రా ప్రజలారా, దేవుని ఉపదేశాలు వినండి.


అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి!


“ఇక్కడ ఒక బాలుని దగ్గర యవలతో చేసిన ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చేపలు ఉన్నాయి. కాని యింతమందికి అవి ఎట్లా సరిపోతాయి?” అని అన్నాడు.


అప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని ప్రజలతో చెప్పాడు.


అప్పుడు ఆ నాలుగు ప్రాణులనుండి ఒక స్వరం, “ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు, ఒక దేనారమునకు మూడు సేర్లు యవలు; నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు!” అని అనటం వినిపించింది.


“గిలాదులో ఉన్న యాబేషుకు వెళ్లండి. ఆ ప్రజలు రేపు మధ్యాహ్నంలోగా రక్షించబడతారని ఆ ప్రజలతో చెప్పండి” అని సౌలు, అతని సైనికులు యాబేషునుండి వచ్చిన మనుష్యులకు చెప్పారు. సౌలు సమాచారాన్ని యాబేషు ప్రజలకు ఆ దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా ఆనందపడ్డారు.


సమూయేలు ఒక రోజు సౌలు వద్దకు వచ్చాడు. గతంలో అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయటానికి యెహోవా తనను పంపిన విషయం జ్ఞాపకం చేస్తూ, మరో వర్తమానం యెహోవా దగ్గర నుండి తెచ్చినట్లు సమూయేలు చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ